2020 డిసెంబరులో ఎగుమతులు స్వల్పంగా పెరిగి లక్షా 99 వేల కోట్లకు చేరుకున్నాయి. 2019తో పోలిస్తే 0.14 శాతం పెరిగాయి. దిగుమతులు కూడా 2019తో పోలిస్తే 7.56 శాతం పెరిగాయి. 2019లో రూ.2.81 లక్షలకోట్లు ఉండగా, అది రూ.3.13 లక్షల కోట్లకు చేరాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు శుక్రవారం వెల్లడించాయి.
ఆ సమయంలో తగ్గాయి..
2020-21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ డిసెంబరు మధ్య కాలంలో 25 లక్షల కోట్లు విలువ చేసే ఎగుమతులు జరిగాయని అంచనా. 12.65 శాతం మేర ఎగుమతులు తగ్గాయి. దిగుమతులు ఏకంగా 25.86 శాతం తగ్గాయి.
ఇదీ చదవండి : 'వ్యాక్సినేషన్‌కు ఈసీ డేటా సాయం'