ETV Bharat / business

ఆరోగ్య బీమా పాలసీలో ఈ రైడర్లు ఉంటే మేలు - ఆరోగ్య బీమా వార్తలు

చాలా ఆరోగ్య పాలసీలు కొన్ని తీవ్రమైన అనారోగ్య సమస్యలను, ప్రమాదాలను పాలసీ పరిధి నుంచి మినహాయిస్తాయి. ఈ నేపథ్యంలో పాలసీలోని పరిమితులను అధిగమించేందుకు కాస్త ప్రీమియం ఎక్కువైనా స‌రే చెల్లించి అదనపు రైడర్లను తీసుకుంటే మేలని సూచిస్తున్నారు నిపుణులు.

health insurance
ఆరోగ్య బీమా పాలసీ
author img

By

Published : Nov 6, 2021, 12:25 PM IST

ఇంట్లో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా పాలసీ ఉండాలి. ఇది కరోనా నేర్పిన గుణపాఠాల్లో ఒకటి. అయితే, ఆరోగ్య బీమా అదనపు ఖర్చుగా కాకుండా.. మనపై మనం పెట్టుకుంటున్న పెట్టుబడిగా భావించాలి. ఇదిలా ఉంటే.. ప‌రిమితితో కూడిన బీమా హామీ సొమ్మును సాధారణ ఆరోగ్య బీమా పాలసీల ద్వారా అంద‌జేస్తారు. చాలా ఆరోగ్య పాలసీలు కొన్ని తీవ్రమైన అనారోగ్య సమస్యలను, ప్రమాదాలను పాలసీ పరిధి నుంచి మినహాయిస్తాయి. ఇది తెలియక మనం భరోసాగా ఉంటే ఆప‌ద స‌మ‌యంలో బీమా కవరేజీ లేదని బాధ‌ప‌డాల్సి వ‌స్తుంది.

రైడర్‌ అంటే..

పాలసీలోని పరిమితులను అధిగమించేందుకు కాస్త ప్రీమియం ఎక్కువైనా స‌రే చెల్లించి అదనపు రైడర్లను తీసుకుంటే మేలు. సాధారణ బీమా పాలసీతో పాటు అందుబాటు ధరలో అదనపు ప్రయోజనాలు కల్పించేవే రైడర్లు. ఇవి చేరితే మన పాలసీ మరింత సమగ్రంగా తయారవుతుంది. అలాగే మన ఆరోగ్యానికి మరింత భరోసా లభిస్తుంది. తీవ్ర అనారోగ్య సమస్యలైన గుండె జబ్బు, క్యాన్సర్‌, కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స వంటి వాటికి వర్తించే విధంగా బీమా కంపెనీలు కొంత అదనపు ప్రీమియంతో రైడర్లను రూపొందించాయి. కొన్ని కంపెనీలు మహిళలకు ప్రత్యేకించినవి, పిల్లలకు పుట్టుకతో వచ్చే ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని పాలసీ రైడర్లను అందుబాటులో ఉంచుతున్నాయి.

ఈ రైడర్లు ఉంటే మేలు..

ఎన్‌సీబీ రక్షణ రైడర్‌: ఏదైనా సంవత్సరంలో మన ఆరోగ్య బీమాను మొత్తమే క్లెయిం చేసుకోకపోతే అందించే ప్రయోజనమే నో-క్లెయిం బోనస్‌(ఎన్‌సీబీ). ఈ రైడర్‌ చేర్చుకోవడం వల్ల హామీ మొత్తం పెరిగే అవకాశం ఉంది. కొన్ని నిర్దేశిత సంవత్సరాల పాటు ఆరోగ్య బీమా తీసుకోకపోతే.. హామీ మొత్తం 100 శాతం పెంచే అవకాశాన్ని కొన్ని సంస్థలు కల్పిస్తున్నాయి. అయితే, ఒకసారి ఆరోగ్య బీమాను ఉపయోగించుకుంటే.. ఎన్‌సీబీ రైడర్‌ కాలపరిమితి పూర్తవుతుంది. మళ్లీ కావాలంటే.. మరోసారి రైడర్‌ను కొనుగోలు చేయాల్సిందే.

ద్రవ్యోల్బణ రక్షణ: ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. ఆదాయాల కంటే ధరలే వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చికిత్స ఖర్చులు సైతం పెరిగిపోతున్నాయి. అలాంటప్పుడు మీరు ఇప్పుడు తీసుకున్న పాలసీ కవర్‌ కొన్నేళ్ల తర్వాత ఏమాత్రం సరిపోకపోవచ్చు. అలాంటప్పుడు ఈ ద్రవ్యోల్బణ రక్షణ రైడర్‌ ఉపయోగపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల నిర్దేశిత సంవత్సరాల తర్వాత మీ హామీ మొత్తం పెరుగుతూ పోతుంది.

క్రిటికల్‌ ఇల్‌నెస్‌ బెనిఫిట్‌ రైడర్: తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వైద్య ఖర్చులు, ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగొచ్చిన తర్వాత కోలుకునేంత వరకు అయ్యే ఖర్చులు, శాశ్వత వైకల్యం కలిగినప్పుడు పాలసీదారుడిపై ఆధారపడిన వారికి క్రమంగా ఆదాయం వంటి వాటికి ఇది ఉపయోగపడుతుంది.

నగదు చెల్లింపు రైడర్లు: ఈ రైడర్లు ఆసుపత్రి ఖర్చులను ముందుగా నిర్దేశించిన మొత్తంలో ఏ రోజుకు ఆ రోజు చెల్లిస్తాయి.

రోగి సంరక్షణ: ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయిన తర్వాత రోగిని సంరక్షించేవారికి సైతం రోజూ వారీ ఖర్చులను చెల్లిస్తాయి.

మెటర్నిటీ రైడర్: సాధారణంగా ఆరోగ్య బీమా పాలసీలు డెలివరీ ఖర్చులకు బీమా కల్పించవు. ఈ పరిమితిని అధిగమించేందుకు ప్రత్యేకమైనదే మెటర్నిటీ రైడర్. ఇందులో డెలివెరీకి అయ్యే ఖర్చు, శిశువు ఆరోగ్య సమస్యలతో పుట్టినప్పుడయ్యే వైద్య, సంరక్షణకు అయ్యే ఖర్చులను చెల్లిస్తాయి. అయితే వీటికి ఆరోగ్య బీమా పాలసీలలో మాదిరే 24 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది.

ప్రమాద బీమా రైడర్: ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు, గుండె జబ్బు లాంటివి వచ్చినప్పుడు హఠాత్తుగా ఆసుపత్రిలో చేరినప్పుడు అయ్యే ఖర్చులకు ఈ పాలసీ రైడర్‌ బీమా కల్పిస్తుంది.

రైడర్లను ఎలా ఎంచుకోవాలి..

నిర్దిష్ట అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైడర్‌ను తీసుకోవాలి. నగదు చెల్లింపు వంటి రైడర్లు ఆసుపత్రిలో చేరినప్పుడు రూమ్ రెంట్ వంటి వాటికి ఉపయోగపడతాయి. అటువంటి రైడర్లను జోడించడం ప్రయోజనకరమే. వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా నిర్దిష్ట కవరేజ్ కోసం క్రిటికల్ ఇల్‌నెస్‌ వంటి రైడర్లను తీసుకోవచ్చు. కానీ కొన్ని రైడర్లకు అనేక పరిమితులు ఉంటాయి. కొన్ని సాధారణ ఆరోగ్య బీమాలో ఖ‌ర్చులు అంతర్గతంగా ఉంటాయి. వీటిని తీసుకునే ముందు పాలసీలో కవరయ్యే అంశాలు, కవర్ కాని అంశాలు, వాటికి అయ్యే ఖర్చులు, పరిమితులు అన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించాలి.

రైడర్లలోని పరిమితులు..

  • ప్రధాన పాలసీ అమల్లో ఉన్నప్పుడు మాత్రమే రైడర్‌ ప్రయోజనాలు పొందే వీలుంటుంది. ప్రధాన పాలసీని సరైన సమయానికి పునరుద్ధరించుకోవడం తప్పనిసరి.
  • రైడర్లలో కొన్ని జీవితాంతం పునరుద్ధరించుకునే వీలు కలిగినవి ఉండగా మరికొన్ని కొంత నిర్ణీత వయసు వరకే ఆ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.
  • పెద్ద వయసు వారు సాధ్యమైనంత వరకు ఎక్కువ కవరేజీ ఉన్న వాటిని తీసుకుంటే మంచిది. కాకపోతే వీటికి ఉప పరిమితులు, అదనపు చెల్లింపులు ఉంటాయి.
  • కొన్ని రైడర్లకు సాధారణ పాలసీలలో ఉన్నట్టు వెయిటింగ్‌ పీరియడ్‌, కూలింగ్‌ పీరియడ్‌ సైతం ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఉత్తమ రైడర్‌ను ఎంచుకోవాలి.

ఇదీ చూడండి : పెట్రో పీడనకు సరైన విరుగుడు అప్పుడే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.