ETV Bharat / business

జూన్​లో 6.55 లక్షల కొత్త ఉద్యోగాలు - కొత్త ఉద్యోగాలు ఇండియా

కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారి సంఖ్య జూన్​ నెలలో 6.55లక్షలుగా నమోదైంది. మే నెలలో ఇది 1.72లక్షలుగా ఉంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్​ఓ) పేరోల్ డేటా ద్వారా ఈ విషయం వెల్లడైంది.

EPFO records 6.55 lakh net new enrolments in June
జూన్​లో 6.55లక్షలకు చేరిన కొత్త ఉద్యోగాల సంఖ్య
author img

By

Published : Aug 20, 2020, 7:51 PM IST

జూన్​లో కొత్త ఉద్యోగాల సంఖ్య 6.55 లక్షలుగా నమోదైనట్టు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) గణాంకాల ద్వారా తెలిసింది. మే నెలలో ఈ సంఖ్య 1.72లక్షలుగా ఉంది.

సంఘటిత రంగంలో మే నెలలో 3.18లక్షల కొత్త ఉద్యోగాలు నమోదైనట్టు ఈపీఎఫ్​ఓ తొలుత చెప్పినప్పటికీ.. ఇటీవలే చేసిన సవరణలతో ఆ సంఖ్య 1.72లక్షలుగా తేలింది.

ఏప్రిల్​లో...

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మార్చి చివరి వారం నుంచి లాక్​డౌన్ అమలు చేసింది కేంద్రం. ఈ నేపథ్యంలో ఉద్యోగ అవకాశాలు ఏప్రిల్​లో రికార్డు స్థాయిలో తగ్గిపోయాయి. ఏప్రిల్​లో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారి సంఖ్య 1.33 లక్షలని తొలుత ప్రకటించింది. కానీ గురువారం విడుదల చేసిన గణాంకాల్లో ఆ సంఖ్యను 20,164కు సవరించింది.

కరోనా విజృంభణకు ముందు మార్చిలో 5.72 లక్షలు, ఫిబ్రవరిలో 10.21 లక్షల మంది కొత్తగా ఉద్యోగాల్లో చేరడం గమనార్హం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చిన వారి సంఖ్య 78.58 లక్షలకు పెరిగింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం(2018-19) ఈ సంఖ్య 61.12 లక్షలుగా ఉంది.

ఇదీ చూడండి:- 4 నెలల్లో రూ.30 వేల కోట్ల పీఎఫ్​ సొమ్ము విత్​డ్రా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.