ETV Bharat / business

మీ ఫోన్​లో డేటా అయిపోయిందా..? నో టెన్షన్​ 'ఎమర్జెన్సీ డేటా' ఉందిగా.. - ఐడియా డేటాలోన్

Emergency Data Loan: మీ ఫోన్​లో ఇంటర్నెట్ డేటా అయిపోయిందా..? అయితే మీరు ఎంచక్కా 'ఎమర్జెన్సీ డేటా లోన్'​ తీసుకోవచ్చు. అవసరమైనప్పుడు డేటాలోన్ తీసుకుని తర్వాత మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చెల్లించుకోవచ్చు. మరి ఏ ఏ టెలికాం సంస్థలు ఈ ఆఫర్​ను అందిస్తున్నాయో తెలుసుకుందామా..

Emergency Data Loan
ఎమర్జెన్సీ డేటా లోన్
author img

By

Published : Mar 4, 2022, 6:08 PM IST

Emergency Data Loan: మొబైల్​లో డెయిలీ డేటా లిమిట్ అయిపోయాక.. ఇంటర్నెట్ వేగం తగ్గిపోతుంది. ఒక్కోసారి అత్యవసర సమయంలో ఉన్నప్పుడు ఇలా సడన్​గా డేటా అయిపోతుంటుంది. అబ్బా.. ఇంకొంచెం డేటా ఉంటే బావుండు అని అనుకుంటాం.

ఇలాంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే.. పలు టెలికాం సంస్థలు 'యూజ్ నౌ పే లేటర్​' అనే నూతన విధానాన్ని తీసుకొచ్చాయి. ఈ ఫీచర్​ వల్ల అవసరమైనప్పుడు డేటాలోన్​ తీసుకుని.. తర్వాత చెల్లించుకోవచ్చు. ఈ వెసలుబాటును జియో, ఎయిర్​టెల్​, ఐడియా టెలికాం సంస్థలు వినియోగదారుల కోసం అందుబాటులోకి తెచ్చాయి. వాటిపై ఓ లుక్కేద్దాం..

జియోలో ఎమర్జెన్సీ డేటా లోన్​..

emergency data loan jio: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో గతేడాదే ఈ ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. 'ఎమర్జెన్సీ డేటా లోన్​' పేరిట వినియోగదారులు ముందస్తు చెల్లింపు లేకుండా రీఛార్జ్​ చేసుకునే వెసులుబాటు కల్పించింది.

జియో వినియోగదారులు ఎంత డేటాను లోన్​గా తీసుకోవచ్చు?

జియో వినియోగదారులు రూ. 25కి 2జీబీ డేటాను లోన్​గా పొందవచ్చు. ప్రీపెయిడ్​ వినియోగదారులు అందరూ ఈ ఫీచర్​ను వినియోగించుకోవచ్చు.

డేటాలోన్​ను తిరిగి ఎలా చెల్లించాలి?

డేటాలోన్​ను తిరిగి చెల్లించడానికి మై జియో యాప్​ను ఓపెన్​ చేసి ప్రొసీడ్​ బటన్ క్లిక్ చేసి.. 'ఎమర్జెన్సీ డేటా ఓచర్స్​'లోకి వెళ్లాలి. స్కీన్​పై పేమెంట్ ఆప్షన్​ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి నగదు చెల్లించాలి.

డేటా లోన్​ను తిరిగి చెల్లించకపోతే..?

డేటాలోన్​ను తిరిగి చెల్లించకపోతే.. ఇలాంటి ఆఫర్ తిరిగి వినియోగించకుండా నిషేధిస్తుంది సంస్థ. చెల్లింపులు పూర్తయ్యాకే డేటా లోన్​ ఆఫర్​లకు అనుమతినిస్తుంది.

ఎయిర్​టెల్ డేటాలోన్..

emergency data loan in airtel: దేశంలో రెండో అతిపెద్ద టెలికాం సంస్థ ఎయిర్​టెల్.. ఎమర్జెన్సీ టాక్​టైం మాత్రమే కాకుండా.. అత్యవసర సమయంలో డేటాలోన్​ను కూడా అందిస్తుంది.

  • రూ. 27కు 80ఎంబీ వరకు ఎమర్జెన్సీ డేటాను అందిస్తుంది ఎయిర్​టెల్.
  • ఈ డేటాకు 2 రోజులపాటు వ్యాలిడిటీ ఉంటుంది.
  • *141*567కు డయల్ చేయడం ద్వారా ఈ డేటా ప్యాక్ యాక్టివేట్ అవుతుంది.

ఐడియా కస్టమర్లు ఇలా..

emergency data loan in idea: వొడాఫోన్ ఐడియా కూడా తమ కస్టమర్లకు ఇంటర్నెట్ లోన్ సౌకర్యం అందిస్తోంది. అయితే వీటికి కొన్ని షరతులు విధించింది ఐడియా. ఇవి వర్తించే కస్టమర్లు మాత్రమే ఈ సేవలను వినియోగించుకోవచ్చు.

ఐడియా డేటాలోన్​కు అర్హతలేంటి?

ఐడియా కస్టమర్​గా మారి 90రోజలు పూర్తికావాలి.

లోన్ తీసుకునే సమయంలో ఉన్న ధర కంటే చెల్లించే సమయంలో ఎక్కువ పే చేయాలి.

ఇంటర్నెట్ లోన్ తీసుకున్న తర్వాత ఫస్ట్​ టైం చేసిన రీఛార్జ్​లో నగదు దానంతట అదే కట్ అవుతుంది.

డేటాలోన్​ను ఎలా పొందాలి?

  • డయలర్​ను ఓపెన్ చేసి *150*06#కు డయల్ చేయాలి. అప్పుడు రూ. 6కు 25ఎంబీ 2జీ డేటా వస్తుంది.
  • *150*333#కు డయల్ చేయడం వల్ల రూ. 11కు 35ఎంబీ 3జీ డేటా లోన్​ యాక్టివేట్​ అవుతుంది.

ఇవీ చూడండి:

రెడ్​మీకి షాక్​.. నోట్​ 11 ప్రో ఫీచర్లు లీక్​.. ధర, ప్రత్యేకతలు ఇవే!

వాట్సాప్​లో​ ఐదు సరికొత్త ఫీచర్లు.. ఇక చాటింగ్​లో సూపర్​ ఫన్!

ఈ తప్పులు చేస్తున్నారా?.. అయితే మీ వాట్సాప్​ అకౌంట్​ బ్లాక్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.