ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నట్లు అనేక గణాంకాలు సూచిస్తున్నాయని అన్నారు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్(Shaktikanta Das RBI Governor) శక్తికాంత్ దాస్. అయితే వృద్ధి స్థిరంగా ఉండాలంటే ప్రైవేటు పెట్టుబడులు కొనసాగాలని తెలిపారు. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఇంకా పలు చర్యలు చేపట్టాల్సిన (Shaktikanta Das RBI Governor) అవసరం ఉందని అన్నారు.
అత్యంత వేగంగా పుంజుకునే సామర్థ్యం భారత్‌కు ఉన్నట్లు (Shaktikanta Das RBI Governor) దాస్ ధీమా వ్యక్తం చేశారు. అంకురాల స్థాపన, ప్రోత్సాహం విషయంలో భారత్ టాప్ పెర్ఫామర్‌గా నిలిచిందన్నారు.
పండగ సీజన్ల కారణంగా డిమాండ్ పెరగడం కూడా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో సంస్థలు ఉపాధి, పెట్టుబడుల పెంపునకు కృషి చేయాలన్నారు.
ఇంధన ధరల తగ్గింపు కూడా..
చమురు ధరలను తగ్గిస్తూ ఇటీవల కేంద్రం సహా పలు రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని.. ఫలితంగా డిమాండ్ మరింత పెరిగే ఆవకాశం ఉందని అభిప్రాయపడ్డారు శక్తికాంత్ దాస్.
వ్యాక్సిన్ పంపిణీలో ప్రపంచంలోనే తొలిస్థానంలో నిలిచిన భారత్.. మహమ్మారి కట్టడికి ముందుండి పోరాడేందుకు సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి : మూలధన వ్యయం పెంచండి: నిర్మలా సీతారామన్