ETV Bharat / business

అదిరిపోయే డిస్కౌంట్లతో 'జియో మార్ట్​' వచ్చేసింది! - జియో మార్ట్​

ఇ-కామర్స్‌ పోర్టల్‌ జియోమార్ట్​ను అందుబాటులోకి తెచ్చింది రిలయన్స్​ జియో. నిత్యావసర వస్తువులతో పాటు వ్యవసాయ ఉత్పత్తులను కూడా అందిస్తోంది. ఇప్పటికే జియోమార్ట్‌ తన కొనుగోలుదార్లు వాట్సాప్‌ ద్వారా ఆర్డర్లు పెట్టడానికి వీలుగా ఒక ఫీచర్‌ను తీసుకొచ్చింది.

E-COMMERCE PORTAL JIO MART STARTS
అదిరిపోయే డిస్కౌంట్లతో.. 'జియె మార్ట్​' వచ్చేసింది!
author img

By

Published : May 24, 2020, 10:21 AM IST

Updated : May 24, 2020, 11:22 AM IST

రిలయన్స్‌ జియో తన ఇ-కామర్స్‌ పోర్టల్‌ జియోమార్ట్‌ను తీసుకొచ్చింది. నెలల తరబడి పరీక్షించిన అనంతరం వెబ్‌సైట్‌ను వినియోగదార్లకు అందుబాటులో ఉంచింది. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి ఆర్డర్లను తీసుకొంటోంది కూడా. ఎంపిక చేసిన ఉత్పత్తులపై గరిష్ఠ చిల్లర ధర(ఎమ్‌ఆర్‌పీ)లో కనీసం 5శాతం డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తున్నట్లు ఆ పోర్టల్‌ చెబుతోంది. నిత్యావసర వస్తువులతో పాటు వ్యవసాయ ఉత్పత్తులను కూడా అందిస్తోంది.

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం.. వ్యవసాయ ఉత్పత్తులను తమతో భాగస్వామ్యం కుదుర్చుకున్న రైతుల నుంచే నేరుగా సేకరిస్తున్నట్లు తెలిపింది. జియోమార్ట్‌ కోసం వాట్సప్‌తో ఒక వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేసినట్లు జియో తెలిపింది. రిలయన్స్‌లో వాట్సప్‌ మాతృ సంస్థ ఫేస్‌బుక్‌ ఇటీవలే షేర్లను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. భారత్‌లోని చిన్న కిరాణా నెట్‌వర్క్‌ స్టోర్లను చేరుకోవడం కోసం జియోమార్ట్‌ ఈ సాంకేతికతను వినియోగిస్తోంది.

ఇప్పటికే జియోమార్ట్‌ తన కొనుగోలుదార్లు వాట్సాప్‌ ద్వారా ఆర్డర్లు పెట్టడానికి వీలుగా ఒక ఫీచర్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతానికి నవీ ముంబయి, ఠానే, కల్యాణ్‌ వంటి ఎంపిక చేసిన ప్రాంతాలకే దీనిని పరిమితం చేసింది. త్వరలోనే దేశంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరించనుంది.

Last Updated : May 24, 2020, 11:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.