ETV Bharat / business

'స్పుత్నిక్​-వీ' మూడో దశ ట్రయల్స్​కు డీసీజీఐ అనుమతి - Sputnik V vaccine news latest

దేశంలో స్పుత్నిక్‌-వీ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతినిచ్చింది. రష్యా అభివృద్ధి చేసిన ఈ టీకా తుది దశ క్లినికల్‌ ట్రయల్స్‌ను ఈ నెలలోనే పూర్తి చేసి, దేశ ప్రజలకు సురక్షితమైన వ్యాక్సిన్‌ను అందించేలా చర్యలు తీసుకుంటామని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ తెలిపింది.

Dr Reddy's gets DCGI nod to conduct phase 3 clinical trials for Sputnik V vaccine
'స్పుత్నిక్​-వీ' మూడో దశ ట్రయల్స్​కు డీసీజీఐ అనుమతి
author img

By

Published : Jan 16, 2021, 5:11 AM IST

రష్యాకు చెందిన కరోనా టీకా స్పుత్నిక్‌-వీ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ జరిపేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతినిచ్చింది. ఈ మేరకు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరీస్‌ వెల్లడించింది. రెండు దశల క్లినికల్‌ ట్రయల్స్‌ భద్రతా సమాచారాన్ని డేటా అండ్‌ సేఫ్టీ మానిటరింగ్‌ బోర్డ్‌(డీఎస్​ఎంబీ) సమీక్షించి.. మూడో దశ ప్రయోగాలకు అనుమతినివ్వాలని డీసీజీఐకి సిఫారసు చేసింది. భద్రతాపరంగా ఎలాంటి సమస్యలు లేవని... వ్యాక్సిన్‌ సురక్షిత ప్రమాణాలను అందుకుందని డీఎస్​ఎంబీ నివేదించింది.

రష్యా అభివృద్ధి చేసిన ఈ టీకాను దేశంలో ఉత్పత్తి చేసేందుకు.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ ఒప్పందం కుదుర్చుకుంది. మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ను ఈ నెలలోనే పూర్తి చేసి, దేశ ప్రజలకు సురక్షితమైన వ్యాక్సిన్‌ను అందించేలా చర్యలు తీసుకుంటామని రెడ్డీస్‌ తెలిపింది.

ఇదీ చూడండి: వ్యాక్సినేషన్​కు సర్వం సిద్ధం- ఇవి గుర్తుంచుకోండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.