ETV Bharat / business

పండుగ జోరుతో మారిన 'ఆటో' గేర్ - నవంబర్​లో పెరిగిన వాహన విక్రయాలు

పండుగ సీజన్​తో నవంబర్​లో ఆటోమొబైల్ హోల్​సేల్​ విక్రయాలు పెరిగాయి. ప్యాసింజర్ వాహన విక్రయాలు 12.72 శాతం పెరిగి 2,85,367 యూనిట్లుగా నమోదైనట్లు సియామ్ ప్రకటించింది.

Auto sale rise in November
నవంబర్​లో పెరిగిన వాహన విక్రయాలు
author img

By

Published : Dec 11, 2020, 4:54 PM IST

హోల్​ సేల్​ వాహన విక్రయాలపై పండుగ సీజన్ సానుకూల ప్రభావం చూపినట్లు భారత వాహన తయారీదారుల సంఘం (సియామ్​) తెలిపింది. పండుగల నేపథ్యంలో గత నెల ప్యాసింజర్ వాహన విక్రయాలు 12.72 శాతం పెరిగి 2,85,367 యూనిట్లుగా నమోదైనట్లు ప్రకటించింది. గత ఏడాది నవంబర్​లో ఈ సంఖ్య 2,53,139గా ఉన్నట్లు గుర్తుచేసింది.

సియామ్ వెల్లడించిన మరిన్ని విషయాలు..

  • ద్విచక్ర వాహన విక్రయాలు గత నెల 13.43 శాతం పెరిగాయి. మొత్తం 16,00,379 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 14,10,939 యూనిట్లు విక్రయమయ్యాయి.
  • మోటార్ సైకిళ్ల విక్రయాలు గత నెల 14.9 శాతం వృద్ధితో.. 10,26,705 యూనిట్లుగా నమోదయ్యాయి. 2019 నవంబర్​లో 8,93,538 యూనిట్లు అమ్ముడయ్యాయి.
  • గత నెల 5,02,561 స్కూటర్లు విక్రయమయ్యాయి. 2019 నవంబర్​లో అమ్ముడైన 4,59,851 యూనిట్లతో పోలిస్తే.. ఇవి 9.29 శాతం అధికం.
  • త్రిచక్ర వాహన విక్రయాల మాత్రం నవంబర్​లో భారీగా 57.64 శాతం పతనమయ్యాయి. 2019 నవంబర్​లో 55,778 యూనిట్లు విక్రయమవగా.. ఈ ఏడాది అదే సమయానికి 23,626 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

ఇదీ చూడండి:'రూ.1.45 లక్షల కోట్ల పన్ను రీఫండ్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.