ETV Bharat / business

హైకోర్టులో వాట్సాప్​, ఫేస్​బుక్​కు చుక్కెదురు - వాట్సాప్ ప్రైవసీ పాలసీ వివాదం

కొత్త ప్రైవసీ పాలసీల విషయంలో ఫేస్​బుక్​, వాట్సాప్​లకు​ దిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. కాంపిటీషన్ కమిషన్​ ఆఫ్ ఇండియా ఆదేశాలను అడ్డుకోవాలని దాఖలు చేసిన పిటిషన్​ను తోసిపుచ్చింది న్యాయస్థానం.

Facebook, WhatsApp, Delhi HC
ఫేస్​బుక్​, వాట్సాప్​, దిల్లీ హై కోర్టు
author img

By

Published : Apr 22, 2021, 12:27 PM IST

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్​.. దాని అనుబంధ సంస్థ వాట్సాప్​లకు దిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వాట్సాప్​ కొత్త ప్రైవసీ పాలసీ నిబంధనలపై సమగ్ర పరిశోధన జరపాలన్న కాంపిటీషన్ కమిషన్​ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆదేశాలను సవాలు చేస్తూ.. ఆయా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్​ను న్యాయస్థానం కొట్టేసింది.

సీసీఐ ఆదేశాలను అడ్డుకునేందుకు.. పిటిషన్​లో సరైన కారణాలేవి లేవవి దిల్లీ హైకోర్టు పేర్కొంది.

వాట్సప్‌ గోప్యతా విధానంపై విచారణ చేపట్టాలని, 60 రోజుల్లోగా దీన్ని పూర్తిచేయాలంటూ గత నెల 24న సీసీఐ ఆదేశాలిచ్చింది. వీటిని ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లు సవాలు చేశాయి. వాట్సప్‌ గోప్యతా విధానంపై ఇప్పటికే సుప్రీంకోర్టు విచారణ చేపడుతున్నందున.. మళ్లీ ఇదే విషయమై సీసీఐ వేరుగా ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయా సంస్థలు పేర్కొన్నాయి.

ఇదీ చదవండి:'19 రోజుల్లో రూ.5,649 కోట్ల పన్ను రీఫండ్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.