ETV Bharat / business

యుద్ధంతో ధరలు పైపైకి - 'చమురు'లో సామాన్యుడే సమిధ

author img

By

Published : Feb 26, 2022, 7:19 AM IST

ఉక్రెయిన్​- రష్యా యుద్ధం కారణంగా రానున్న రోజుల్లో చమురు ధరలు భారీగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వంటగ్యాస్​పైన తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. మన దేశం పునరుత్పాదక (ప్రత్యామ్నాయ) ఇంధన వనరులను విస్తృతం చేసుకోవటంతో పాటు చమురు అన్వేషణకు మరింత ప్రాధాన్యం ఇవ్వకపోతే భవిష్యత్‌లో మన పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని అంటున్నారు.

crude oil prices surging due to Russia's war on Ukraine
యుద్ధం సాకు.. ధరలు ఎగబాకు

'రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. రానున్న రోజుల్లో మరింత పెరగనున్నాయి. ఈ ప్రభావం మన దేశంపైనా పడనుంది. వాస్తవానికి రష్యా లేదా ఉక్రెయిన్‌ నుంచి మనకు చమురు రానేరాదు. సప్లై చైన్‌ కూడా ఆ మార్గంలో లేదు. అయినా ధరలు పెరుగుతాయి. చమురుపై పట్టున్న ఒపెక్‌ దేశాలలది ఓ పెద్ద కూటమి. ధరలు పెంచడానికి ప్రతి అవకాశాన్నీ అవి అందిపుచ్చుకుంటాయి. చమురుతో పాటు వంట గ్యాస్‌ పైనా ఈ ప్రభావం పడుతుంది' అని చమురు, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ విశ్రాంత కార్యదర్శి తరుణ్‌ కపూర్‌ వెల్లడించారు. మన దేశం పునరుత్పాదక (ప్రత్యామ్నాయ) ఇంధన వనరులను విస్తృతం చేసుకోవటంతో పాటు చమురు అన్వేషణకు మరింత ప్రాధాన్యం ఇవ్వకపోతే భవిష్యత్‌లో మన పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని అంటున్నారు. మన అవసరాల్లో 15 శాతం కూడా సొంతంగా ఉత్పత్తి చేసుకోవటం లేదని.. ఈ పరిస్థితి మారాలని చెబుతున్నారు. యుద్ధం నేపథ్యంలో చమురు ధరల పెరుగుదల పరిణామాలపై ఆయన 'ఈనాడు'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పెరుగుదల ప్రభావం భారతదేశంపై ఎలా ఉండబోతోంది?

చాలా తీవ్రంగా ఉంటుంది. సరఫరాపై ఎలాంటి ప్రభావం ఉండదు. కానీ ధరలు పెరుగుతాయి. ఈ పరిస్థితులు ఎక్కువకాలం కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థను అది కుదేలు చేస్తుంది. విదేశీ మారక ద్రవ్యం మరింతగా ఆవిరి అవుతుంది. సామాన్య ప్రజల ఆర్థిక అంచనాల్లోనూ తేడాలొస్తాయి. పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరల పెరుగుదల చూడటానికి చిన్నగా కనిపిస్తుంది. కానీ ఆ ప్రభావం నిత్య జీవితంలో అన్నింటిపైనా పడుతుంది.

చమురు, గ్యాస్‌ దిగుమతులు ఏ స్థాయిలో ఉంటున్నాయి?

ఏటా రూ. ఆరు లక్షల కోట్ల విలువ చేసే చమురు దిగుమతి చేసుకుంటున్నాం. దాదాపు 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌, పారిశ్రామిక గ్యాస్‌ అవసరాలు ఏటా పెరిగేవే కానీ తగ్గేవి కాదు. దేశంలో ఏటా 230 మిలియన్‌ టన్నుల చమురును దిగుమతి చేసుకుంటున్నాం. ఏటా రూ. ఆరు లక్షల కోట్లు వ్యయం చేస్తున్నాం. పరిస్థితులు ఇలానే ఉంటే వచ్చే అయిదేళ్లలో అది 500 మిలియన్‌ టన్నుల స్థాయిని దాటిపోవచ్చు కూడా.

ఇంతగా ధరలు పెరగడానికి కారణం ఏమిటి?

చమురును గుప్పిట పట్టిన ఒపెక్‌ దేశాలు తరచుగా చేసే దోపిడీయే ఇది. ధరలు పెంచటానికి అవకాశం ఎప్పుడు వస్తుందా కాచుకుని ఉంటాయి. రష్యా నుంచి యూరప్‌ దేశాలకు గ్యాస్‌ ఎగుమతి అవుతుంది. అక్కడి నుంచి మనకు వచ్చేది ఏమి ఉండదు. మనకు 67 శాతం వరకు చమురు ఇరాక్‌, సౌదీ, యూఏఈల నుంచి వస్తుంది. మిగిలింది ఉత్తర అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచే వస్తుంది.

ఈ గడ్డు పరిస్థితులను ఎదుర్కోవటం ఎలా?

కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. అది కూడా బహుముఖ వ్యూహంగా ఉండాలి. ఇంధనానికి ప్రత్యామ్నాయ మార్గాలపై మరింత వేగంగా దృష్టి పెట్టాలి. చమురు అన్వేషణనూ మరింత పెంచాలి. దేశ రక్షణకు ఎంత ఖర్చు చేస్తామో ఆ స్థాయిలో పునరుత్పాదక ఇంధన వనరులపై వెచ్చించాల్సి ఉంటుంది. వంటకు కూడా విద్యుత్‌ వినియోగించేలా చూడాలి. విద్యుత్‌ వాహనాల వినియోగం పెంచాలి. ఈ వాహన తయారీదారులకు మౌలిక సదుపాయాలను కల్పించి ప్రోత్సహించాలి.

దేశీయంగా చమురు ఉత్పత్తి ఎంత?

దేశ అవసరాల్లో 85 శాతం చమురు దిగుమతి చేసుకుంటున్నాం. అంటే దేశీయ ఉత్పత్తి 15 శాతమే. దేశీయంగా ఏడాదికి 30 నుంచి 35 మిలియన్‌ టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాం.

దిగుమతులు తగ్గించుకునేందుకు ఎన్నేళ్లు పడుతుందంటారు?

ప్రస్తుతం 50 కిలోమీటర్ల వేగంతో మన ప్రయత్నాలు సాగుతున్నాయనుకుంటే వాటిని 150 కిలోమీటర్ల వేగానికి పెంచితే 10 నుంచి 15 సంవత్సరాల్లో కనీసం 50 శాతం ఫలవంతంగా ఉంటాయి. కేవలం చమురే కాదు పునరుత్పాదక ఇంధనాలకూ ఇది వర్తింపజేయాలి.

చమురు అన్వేషణలు ఏ స్థాయిలో ఉన్నాయి?

నూతన చమురు బావుల కోసం యుద్ధ సమయంలో సైన్యం ఎలా పని చేస్తుందో ఆ స్థాయిలో సాగిస్తే ఫలితం ఉంటుంది. దేశీయంగా చమురు నిక్షేపాలు భారీగానే ఉన్నాయి. అన్వేషణలో చమురు నిక్షేపాలను గుర్తించినా ఉత్పత్తి దశకు రావాలంటే కనీసం అయిదు నుంచి ఏడేళ్లు పడుతుంది.

ఇదీ చదవండి: రష్యా-ఉక్రెయిన్​ యుద్ధంతో గ్యాస్ ధరకు రెక్కలు- వాటికి తీవ్ర కొరత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.