ETV Bharat / business

భారత్​లో టీకా వినియోగ దరఖాస్తు ఉపసంహరించుకున్న ఫైజర్​ - కరోనా టీకా

భారత్​లో తమ టీకా అత్యవసర వినియోగానికి చేసుకున్న ప్రతిపాదనను ఉపసంహరించుకుంది ఫైజర్​. భవిష్యత్తులో మరింత పూర్తి సమాచారంతో విజ్ఞప్తి పెట్టుకుంటామని వెల్లడించింది.

Pfizer withdraws Emergency Use Authorisation application in India
డీసీజీఐకి చేసుకున్న విజ్ఞప్తిని ఉపసంహరించుకున్న ఫైజర్​
author img

By

Published : Feb 5, 2021, 11:34 AM IST

ఫైజర్ టీకాను భారత్‌లో అత్యవసర వినియోగానికి అనుమతించాల్సిందిగా భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)కి చేసిన విజ్ఞప్తిని ఉపసంహరించుకుంటున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఫిబ్రవరి 3న డీసీజీఐ నిపుణులతో భేటీ అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఫైజర్ వెల్లడించింది.

ఈ సమావేశంలో నిపుణులు ఫైజర్ నుంచి మరింత అదనపు సమాచారం అడిగారని తెలిపిన ఆ సంస్థ.. త్వరలో ఆ మేరకు డేటాతో మళ్లీ డీసీజీఐకి ప్రతిపాదనలు పంపుతామని పేర్కొంది.

భవిష్యత్తులో తెస్తాం..

భవిష్యత్‌లో భారత్‌లో ఫైజర్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తామని వెల్లడించింది. కొవిడ్-19 వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి సంబంధించి భారత్‌లో విజ్ఞప్తి పెట్టుకున్న తొలి టీకా ఫైజర్ కాగా ఇప్పటి వరకూ డీసీజీఐ ఏ నిర్ణయం తీసుకోలేదు. గత డిసెంబర్‌లో అత్యవసర వినియోగంపై ప్రతిపాదనలు చేసిన ఫైజర్‌ దేశంలో ఎటువంటి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించకుండానే.. దిగుమతి చేసుకొని విక్రయాలు, పంపిణీ చేసుకునేందుకు సహకరించాలని అందులో కోరింది.

ఇదీ చూడండి: 'ఫైజర్'​కు ఆస్ట్రేలియా ఓకే- ఫిబ్రవరి నుంచి వ్యాక్సినేషన్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.