ETV Bharat / business

కరోనా ప్రభావంతో నెమ్మదించిన నియామకాలు

author img

By

Published : Mar 23, 2020, 6:20 AM IST

ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తున్న కరోనా వైరస్​ కారణంగా ఉద్యోగాల కల్పనపై తీవ్ర ప్రభావం పడనుంది. చాలా ప్రాంతాలు కొవిడ్​-19 నేపథ్యంలో లాక్​డౌన్​లో ఉండటం కారణంగా సంస్థల ఇంటర్వ్యూలు రద్దు చేయడం, వాయిదా వేయడం వంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ ప్రభావం ఉద్యోగాల కల్పనపై పడుతోంది.

delay job
కరోనా ఎఫెక్ట్ ఆన్ జాబ్స్

కరోనా వైరస్​ కారణంగా కొత్త ఉద్యోగాల కల్పన స్తంభించే ప్రమాదం ఏర్పడింది. కొవిడ్-19​ ప్రభావం తగ్గే వరకు ఇంటర్వ్యూలను రద్దు చేసేందుకు కంపెనీలు మొగ్గు చూపుతుండటం ఇందుకు ప్రధాన కారణం. సేవారంగంలో ఈ ప్రభావం అధికంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

"కొవిడ్​-19 వ్యాప్తి కారణంగా కంపెనీలు ఇంటర్వ్యూలను రద్దు చేస్తున్నాయి. ఇటర్వ్యూలు 60-65 శాతం వరకు తగ్గిపోవడం గానీ ఆలస్యమవడం గానీ జరగొచ్చని మేం అంచనా వేస్తున్నాం. దేశంలో చాలా ప్రాంతాలు లాక్​డౌన్​లో ఉన్నాయి. ప్రజలు కూడా ఇంటివద్దనే ఉండాలని అధికారులు చెబుతున్నారు."

-బీఎఫ్​ఎస్​ఐ అండ్ గవర్నమెంట్​​ వర్టికల్​, అమిత్ వాదేరా

బ్యాంకింగ్, ఆర్థిక సేవలు​, బీమా, రిటైల్, లాజిస్టిక్స్(డెలివరీ) వంటి రంగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తుండగా... చాలా కంపెనీలు తమ కార్యకలాపాలనుు యథాతథంగా కొనసాగించేందుకు సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడనున్నట్లు తెలిపారు అమిత్​.

కొవిడ్-19 కారణంగా కీలకమైన చాలా ప్రాజెక్టులు నెమ్మదించే అవకాశం ఉన్నట్లు సీఐఈఎల్ హెచ్​ఆర్ సర్వీసెస్ సీఈఓ ఆదిత్య నారాయణ్ మిశ్రా అభిప్రాయపడ్డారు. తద్వారా ఆదాయంపై ప్రభావం ఏర్పడి.. నియామకాలు ఆలస్యంగా జరిగే అవకాశం ఉందన్నారు.

"ఇప్పటికే వ్యక్తిగత ఇంటర్వ్యూలు రద్దు కావడం మనం చూస్తున్నాం. భవిష్యత్తు అవసరాలు సహా తమ ఆదాయ వనరులపై సంస్థలు ఆందోళన చెందుతున్నాయనే విషయానికి ఇదో సూచన. ఈ సంక్షోభం కారణంగా మందగమనం ప్రారంభమవుతుంది."

-ఆదిత్య నారాయణ్ మిశ్రా, సీఐఈఎల్ హెచ్​ఆర్ సర్వీసెస్ సీఈఓ

అయితే కొన్ని రంగాల్లో ఈ వైరస్ కారణంగా నియామకాలు పెరిగే అవకాశం ఉందని షైన్​.కామ్ సీఈఓ జైరస్ మాస్టర్ పేర్కొన్నారు.

"హెల్త్​కేర్​లో నియామకాలు పెరుగుతాయి. ప్రజలు ఇంట్లోనే ఉండేందుకు మొగ్గు చూపుతున్నందున ఈకామర్స్, ఆన్​లైన్ డెలివరీ పోర్టల్స్​కు డిమాండ్ పెరుగుతుంది. స్వల్పకాలికంలో పర్యటకంపై ఎక్కువ ప్రభావం పడింది. అయితే త్వరలోనే ఈ రంగం కోలుకొని నియామకాలు కొనసాగిస్తాయి."

-జైరస్ మాస్టర్, షైన్.కామ్ సీఈఓ

ఆతిథ్యం, రిటైల్, ట్రావెల్ రంగాల్లో నియామకాలు మందగిస్తాయని 'మైఖేల్ పేజ్ ఇండియా' ఎండీ నికోలస్ తెలిపారు. వైరస్ ఉద్ధృతి కొనసాగితే దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందన్నారు. అయితే సాంకేతికత ఆధారిత రంగాలు ఆన్​లైన్​లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయని, ఈ ప్రక్రియ తొందరగా ముగుస్తుందని నికోలస్ తెలిపారు.

ఇదీ చదవండి: కేసీఆర్​ తెచ్చిన 'కరోనా చట్టం'తో ఏం చేయొచ్చో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.