ETV Bharat / business

స్పైస్​జెట్​ సర్వీస్​లు రద్దు- కరోనానే కారణం

author img

By

Published : Mar 19, 2020, 4:28 PM IST

దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండగా ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్​ జెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్​ 30వరకు తన అంతర్జాతీయ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

COVID-19: SpiceJet 'forced' to suspend most international flights till April-end
vస్పైస్​జెట్​ సర్వీస్​లు రద్దు.. కరోనానే కారణం

కరోనా వైరస్​ అన్ని కీలక రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మహమ్మారి ​ధాటికి విమానయాన రంగం కుదేలవుతోంది. ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్​ జెట్ ఏప్రిల్​ 30 వరకు తన అంతర్జాతీయ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

"కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను మార్చి 21 నుంచి ఏప్రిల్ 30 వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నాము. ఆ తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొంటే సర్వీసులను తిరిగి ప్రారంభిస్తాం."

-ఓ స్పైస్​జెట్​ అధికార ప్రతినిధి

కోల్​కతా-ఢాకా విమాన సర్వీస్​ కొనసాగుతుందని సంస్థ తెలిపింది. చెన్నై- కొలంబో సర్వీసులు మార్చి 25 నుంచి, దిల్లీ- దుబాయ్​, ముంబయి- దుబాయ్​ సర్వీసులను ఏప్రిల్​ 16 నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు అధికార ప్రతినిధి వెల్లడించారు.

ఇదీ చూడండి:రేపే నిర్భయ దోషులకు ఉరి.. స్టే పిటిషన్​ కొట్టివేత

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.