ETV Bharat / business

లాక్​డౌన్​ వేళ ఈ యాప్​లకు భలే ఆదరణ

author img

By

Published : Apr 11, 2020, 10:11 AM IST

దేశంలో లాక్​డౌన్ కొనసాగుతున్నందున ఇళ్లకే పరిమితమైన ప్రజలు ఓటీటీ మీడియా సేవలు, విద్యా, వ్యాయామ యాప్​లను అధికంగా వినియోగిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్​ల వాడకం కూడా ఎక్కువైందని ఓ సర్వేలో తేలింది.

COVID-19:Demand for OTT content, educational, fitness apps up in India
లాక్​డౌన్​ ఎఫెక్ట్​: ఈ యాప్​లను అధికంగా వాడేస్తున్నారు!

కరోనా వైరస్​ కట్టడిలో భాగంగా ప్రస్తుతం దేశవ్యాప్త లాక్​డౌన్​ విధించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఇళ్లల్లో ఖాళీగా ఉంటున్న ప్రజలు ఆన్​లైన్​లోనే​ ఎక్కువసేపు గడుపుతున్నట్లు గురుగ్రామ్​ కేంద్రంగా పని చేస్తున్న బాబుల్​ ఏఐ సంస్థ సర్వేలో తేలింది. లాక్​డౌన్​ కారణంగా గతంలో కంటే ఎక్కువ సమయం ఓటీటీ, విద్యా, వ్యాయామ యాప్​లలో గడుపుతున్నారని సర్వే తెలిపింది. వీడియో కాన్ఫరెన్స్​లు కూడా భారీగా పెరిగినట్లు పేర్కొంది.

ఎంటర్​టైన్​మెంట్​ యాప్​లలో ఇలా..

కొవిడ్ వ్యాప్తి తర్వాత దేశంలో జూమ్​, హ్యాంగవుట్​, గూగుల్​ డ్యుయో, హౌస్​పార్టీ వంటి వీడియో కాన్ఫరెన్సింగ్​ యాప్​లలో నెటిజన్లు వెచ్చించే సమయం 71 శాతం పెరిగిందని సర్వే వెల్లడించింది. ఆయా యాప్​లలో యాక్టివ్ వినియోగదారుల సంఖ్య 104 శాతం వృద్ధి చెందినట్లు తెలిపింది.

ఓటీటీ యాప్​లు అయిన హాట్​స్టార్​, అమెజాన్, నెట్​ఫ్లిక్స్​లను వినియోగించే సమయం.. 81 శాతం పెరిగిందని సర్వేలో వెల్లడైంది.

వ్యాయామ విభాగంలో ఇలా...

లాస్​ వెయిట్ ఎట్​ హోమ్​ యాప్​లో వినియోగదారులు గడిపే సమయం 46.98 శాతం పెరిగింది. ఇవే కాకుండా ఈ-లెర్నింగ్ ప్లాట్​ఫాంలు ఉడెమీ, అన్​అకాడమీ, బైజూస్​ వంటి వాటి యాప్​లను క్రితంతో పోలిస్తే యూజర్లు 82.73 శాతం అధికంగా వినియోగిస్తున్నారు.

విపరీతంగా పెరిగిన సోషల్​ మీడియా వినియోగం

లాక్​డౌన్​ అమలు వల్ల సామాజిక మాధ్యమాలు, మెసేజింగ్ యాప్​ల వాడకం కూడా విపరీతంగా పుంజుకుంది. ఇన్​స్టాగ్రామ్​, ఫేస్​బుక్, వాట్సాప్​, ట్విట్టర్​ వంటి యాప్​లలో వినియోగదారులు గడిపే సమయం 46.28 శాతం పెరిగింది.

ఇదీ చదవండి: మలేరియా మందు ఎగుమతులపై కేంద్రం కొత్త ట్విస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.