ప్రభుత్వ రంగ సంస్థల్లో బీఎస్ఎన్ఎల్-ఎంటీఎన్ఎల్ సేవల వినియోగాన్ని తప్పనిసరి చేసింది కేంద్రం. వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ కార్యాలయాలు ఇకనుంచి వీటి సేవలనే ఉపయోగించుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది టెలికాం శాఖ. ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఇందుకు సంబంధించిన లేఖలను అన్ని ప్రభుత్వ శాఖలు, కార్యదర్శులకు ఈనెల 12న పంపింది.
తీవ్ర నష్టాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్, ఎమ్టీఎన్ఎల్ను గట్టెక్కించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 2019-20లో బీఎస్ఎన్ఎల్కు రూ.15,500 కోట్లు నష్టం వాటిల్లగా, మహంగర్ టెలీఫోన్ నిగమ్ లిమిటెడ్(ఎంటీఎన్ఎల్)కు రూ.3,694 కోట్ల నష్టం వచ్చింది.
తీవ్ర నష్టంలో ఉన్నందువల్లే వినియోగదారుల తగ్గుదల
నెట్వర్క్ | 2008(నవంబర్) | 2020(జులై) |
బీఎస్ఎన్ఎల్ | 2.9 కోట్లు | 80 లక్షలు |
ఎంటీఎన్ఎల్ | 35.4 లక్షలు | 30.7 లక్షలు |
ఇదీ చదవండి:ఆద్యంతం ఒడుదొడుకులు.. చివరకు స్వల్ప లాభాలు