Call Details Records: కాల్ రికార్డింగ్స్‌కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ కాల్స్, శాటిలైట్ ఫోన్ కాల్స్, కాన్ఫరెన్స్ కాల్స్, సాధారణ నెట్‌వర్క్‌లతో పాటు ఇంటర్నెట్‌లో పంపిన మెసేజ్‌ల వివరాలను కనీసం రెండేళ్లపాటు భద్రపరచడాన్ని తప్పనిసరి చేసింది. టెలికాం ఆపరేటర్లకు ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది టెలికాం శాఖ. గతంలో ఏడాది పాటే కాల్ రికార్డింగ్ డేటాను భద్రపరచగా.. ఆ వ్యవధిని రెండేళ్లకు పెంచుతూ టెలికాం శాఖ(డాట్) డిసెంబరులో ఏకీకృత లైసెన్స్‌లో సవరణ చేసింది.
"నెట్‌వర్క్ నుంచి జరిగిన సంభాషణలకు సంబంధించి కమర్షియల్ రికార్డ్స్, కాల్ వివరాల రికార్డ్, ఎక్స్ఛేంజ్ వివరాల రికార్డ్, ఐపీ వివరాల రికార్డులను ప్రభుత్వ పరిశీలన కోసం రెండేళ్ల పాటు తప్పనిసరిగా భద్రపరచాలి. లైసెన్సర్ నుంచి ఎలాంటి దిశానిర్దేశాలు అందకపోతే ఆ డేటాను తర్వాత డిలీట్ చేయవచ్చు. వాయిస్ మెయిల్స్, ఆడియో టెక్స్, యూనిఫైడ్ మెసేజింగ్ సేవలకు ఈ నిబంధన వర్తిస్తుంది" అని జనవరి 27న జారీ చేసిన ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది.
ఈ లైసెన్సులు పొందిన టాటా కమ్యూనికేషన్స్, సిస్కోస్ వెబెక్స్, ఏటీ అండ్ టీ గ్లోబల్ నెట్‌వర్క్ తదితర కంపెనీలకు కూడా ఈ సవరణ వర్తిస్తుంది.
డాట్ జనవరి 25న ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్(ఐఎల్‌డీ) లైసెన్స్‌లో సవరణలు చేసింది. దీని ద్వారా కాల్ వివరాల రికార్డులను భద్రపరచడాన్ని ఒక ఏడాది పొడిగించడం సహా ఇంటర్నెట్ ప్రోటోకాల్‌ను ఉపయోగించి చేసిన అంతర్జాతీయ కమ్యూనికేషన్ల వివరాలను భద్రపరిచే వీలుంటుంది.
శాటిలైట్ ఫోన్ కాల్స్, డేటా సేవలను అందించడానికి బీఎస్ఎన్ఎల్కు జారీ చేసిన లైసెన్స్‌లోనూ ఇదే విధమైన సవరణ చేసింది కేంద్రం. ఉపగ్రహ ఆధారిత సేవలను అందించే వీశాట్ లైసెన్స్ కలిగిన ఆపరేటర్లకు కూడా కనీసం రెండేళ్లపాటు కాల్ డేటా, ఇంటర్నెట్ కమ్యూనికేషన్స్ రికార్డులను నిల్వ చేయడాన్ని తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: బడ్జెట్‌పైనే అందరి దృష్టి.. స్టాక్ మార్కెట్ల దారెటు?