ETV Bharat / business

చైనా సర్వర్లకు 'పబ్​జీ' కొత్త గేమ్​ డేటా?

'బ్యాటిల్​ గ్రౌండ్స్​ మొబైల్​ ఇండియా' పేరుతో భారత మార్కెట్లోకి వచ్చేందుకు పబ్​జీ చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలోనే చుక్కెదురైంది. ఈ యాప్ యూజర్ల డేటాను దాని మాతృ సంస్థ క్రాఫ్టన్..​ చైనా సహా ఇతర దేశాల్లోని సర్వర్లకు బదిలీ చేయొచ్చని ఓ సంస్థ ఆరోపించింది. భారతీయ ట్రేడర్ల సమాఖ్య కూడా ఇదే కారణాలతో 'బ్యాటిల్​ గ్రౌండ్స్​ మొబైల్​ ఇండియా'ను నిషేధించాలని కేంద్రానికి లేఖ రాసింది.

Data privacy Issue in Battlegrounds Mobile India
బ్యాటిల్​ గ్రౌండ్స్ గేమ్​కు డేటా ప్రైవసీ వివాదం
author img

By

Published : Jun 21, 2021, 5:02 PM IST

Updated : Jun 21, 2021, 6:41 PM IST

డేటా ప్రైవసీ కారణాలతో గత ఏడాది నిషేధానికి గురైన పబ్​జీ.. భారత్ మార్కెట్లోకి తిరిగి వచ్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దీనితో అదే గేమ్​కు స్వల్ప మార్పులు చేసి.. 'బ్యాటిల్​ గ్రౌండ్స్​ మొబైల్​ ఇండియా' పేరుతో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఈ గేమ్​ అందుబాటులోకి రాకున్నా ముందస్తు యాక్సెస్ ద్వారా ఇప్పటికే దీనిని చాలా మంది వినియోగిస్తున్నారు. మొదటి రోజే 50 లక్షల డౌన్​లోడ్​లు సాధించడం గమనార్హం.

అవే చిక్కులు..

ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ యాప్​కు ఆదిలోనే పెద్ద చిక్కు వచ్చి పడింది. ఈ గేమ్​ డౌన్​లోడ్​ చేసుకున్న యూజర్ల డేటాను ప్రస్తుతం భారత్, సింగపూర్​లో స్టోర్​ చేస్తున్నట్లు కంపెనీ ఇది వరకే వెల్లడించింది. అయితే ఈ డేటాను చైనా, హాంకాంగ్, అమెరికా, రష్యాలోని సర్వర్లకూ చేరుతున్నట్లు గేమ్​ గురించి అధ్యయనం చేసిన ఓ సంస్థ ఆరోపించింది.

ఈ గేమ్​ను భారత్​లో విడుదల చేసే ముందు.. చైనాతో అన్ని రకాల ఒప్పందాలను రద్దు చేసుకున్నట్లు 'బ్యాటిల్​ గ్రౌండ్స్​ మొబైల్​ ఇండియా' మాతృ సంస్థ క్రాఫ్టన్​ వెల్లడించింది. గేమ్​​ ప్రైవసీ పాలసీ పేజీలో.. 'న్యాయపరమై అవసరాలకు, గేమ్​ నిర్వహణ వంటి అవసరాల కోసం.. మీ డేటాను ఇతర దేశాలకు తరలించొచ్చు.' అని పేర్కొంది. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని భారత్​, సింగపూర్​లో ఉన్న సర్వర్లలో నిక్షిప్తం చేయనున్నట్లు కూడా తెలిపింది. ఒకవేళ వేరే దేశానికి బదిలీ చేయాల్సి వస్తే.. భారత్​లో ఉన్నట్లుగానే అక్కడ కూడా మీ డేటాకు పూర్తి భద్రత ఉంటుందని హామీ ఇచ్చింది.

ఆ సర్వర్లకు డేటా బదిలీ?

ఐజీఎన్​ ఇండియా నివేదిక.. 'బ్యాటిల్​ గ్రౌండ్స్​ మొబైల్​ ఇండియా' ఏపీకే డేటాను చైనా సహా ఇతర దేశాల్లోని సర్వర్లకు బదిలీ చేసేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా బీజింగ్​లోని మొబైల్ కమ్యూనికేషన్ సర్వర్లలో , హాంకాంగ్​లోని ప్రాక్స్​మా బీటా (టెన్​సెంట్​ అధీనంలోని సంస్థ), మాస్కో, ముంబయి, అమెరికాల్లోని మైక్రోసాఫ్ట్ అజూర్ సర్వర్లకు ఈ డేటాను బదిలీ చేస్తున్నట్లు ఆరోపించింది ఐజీఎన్​ ఇండియా.

నిషేధానికి డిమాండ్..

ఇలాంటి కారణాలతోనే.. భారతీయ ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) కూడా కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్​కు లేఖ రాసింది. 'బ్యాటిల్​ గ్రౌండ్స్​ మొబైల్​ ఇండియా' గేమ్​ను నిషేధించాలని డిమాండ్ చేసింది. భారత్ నిషేధం విధించిన పబ్​జీ లోని చాలా ఫీచర్లు ఇందులో ఉన్నాయని.. అందుకే ప్లే స్టోర్​ నుంచి ఈ గేమ్​ను తొలగించాలని కోరింది.

ఇదీ చదవండి:ఈ బ్యాంక్​ల ఏటీఎంలు ఎన్నిసార్లు వాడినా ఫ్రీ!

Last Updated : Jun 21, 2021, 6:41 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.