ETV Bharat / business

40 కోట్ల మార్క్​ దాటిన జన్​ ధన్​ ఖాతాలు - దేశంలో జన్​ ధన్ బ్యాంకు ఖాతాల సంఖ్య

కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాల్లో ఒకటైన ప్రధాన్ మంత్రి జన్​ ధన్ యోజన మరో రికార్డు సాధించింది. దేశవ్యాప్తంగా జన్​ ధన్ యోజన ద్వారా జారీ చేసిన బ్యాంకు ఖాతాల సంఖ్య 40 కోట్ల మార్క్​ దాటింది. పథకం ప్రారంభించిన ఆరేళ్లలోపే ఈ మైలురాయిని దాటడం విశేషం.

Jan Dhan Yojana crosses 40-crore mark
కొత్త మైలు రాయి దాటిన జన్​ ధన్ ఖాతాలు
author img

By

Published : Aug 3, 2020, 2:28 PM IST

దేశంలో అందరికీ బ్యాంకు ఖాతా ఉండాలనే ఉద్దేశంతో కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రధాన్ మంత్రి జన్​ ధన్ యోజన మరో రికార్డు నెలకొల్పింది. దేశవ్యాప్తంగా జన్ ధన్ బ్యాంకు ఖాతాల సంఖ్య 40.05 కోట్ల మైలురాయిని దాటింది. జన్​ ధన్ ఖాతాల్లో డిపాజిట్లు కూడా రూ.1.30 లక్షల కోట్ల మార్క్​ అధిగమించినట్లు కేంద్ర ఆర్థిక సేవల విభాగం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

జన్​ ధన్ యోజన ప్రారంభించి త్వరలోనే ఆరేళ్లు పూర్తవనుంది. ఆలోపే ఖాతాల సంఖ్య 40 కోట్ల మైలురాయిని దాటడం గమనార్హం. 2014 ఆగస్టు 28న ఈ పథకాన్ని ప్రారంభించింది కేంద్రం.

ప్రభుత్వం నుంచి వచ్చే అనేక ప్రయోజనాలను నేరుగా లబ్ధిదారులకే అందించేందుకు కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. జన్ ధన్​ ఖాతా కనీస డిపాజిట్​ అకౌంట్​గానూ ఉపయోగపడుతుంది. ఈ పథకం కింద ఖాతా తీసుకున్న వారికి రూపే డెబిట్​ కార్డు కూడా లభిస్తుంది.

జన్​ ధన్​ ఖాతా ఉన్న వారికి తొలుత రూ.లక్ష వరకు ప్రమాద బీమా అందించింది కేంద్రం. 2018 ఆగస్టు 28 తర్వాత ఈ పథకం కింద ఖాతా తెరిచిన వారికి ప్రమాద బీమా పరిమితిని రూ.2 లక్షలకు పెంచింది.

ఇదీ చూడండి:టిక్​టాక్ కొనుగోలుకు స్పీడు పెంచిన మైక్రోసాఫ్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.