సొంత ఇల్లు అనేది చాలా మందికి చిరకాల కల. గృహ కొనుగోలుకు భారీ మొత్తం వెచ్చించాల్సి ఉంటుంది. ఇళ్లు కొనుగోలు చేసేందుకు కొంత మంది రుణ సదుపాయం అవసరం లేదు. పూర్తి మొత్తం ఒకేసారి చెల్లించి కొనుగోలు చేసే వారు ఉంటారు. అందుకు పన్ను లేదా పూర్తి మొత్తం చెల్లించేందుకు ఒక ప్రామాణికంగా పరిగణించే నియమం పాటించవచ్చు.
అలా అయితే.. ఓకే..
డిపాజిట్ చేసినట్లయితే వచ్చే వడ్డీ రేటు గృహ రుణం కంటే తక్కువున్నట్లయితే ఒకే సారి పూర్తి మొత్తం చెల్లించి గృహం కొనుగోలు చేయటం ఉత్తమం. అదే డిపాజిట్ పై వచ్చే వడ్డీ అనేది గృహ రుణ వడ్డీ కంటే ఎక్కువుంటే గృహ రుణం తీసుకోవటం ఉత్తమం. ఉదాహరణకు రూ.25 లక్షల గృహ రుణం తీసుకున్నారనుకోండి. దానికి 8 శాతం వడ్డీ, 20 సంవత్సరాల వ్యవధి ఉన్నట్లయితే పన్ను ప్రయోజనాలు తీసివేయగా వడ్డీతో కలిపి చెల్లించాల్సిన మొత్తం దాదాపు రూ.50.18 లక్షలు అవుతుంది. అదే మొత్తం అదే సమయానికి ఫిక్స్డ్ డిపాజిట్ చేయగా మెచ్యురిటీ సమయంలో రూ.1.23 కోట్లు అందుతాయి. అందులో వడ్డీనే రూ.98 లక్షలు.
రుణం వల్ల పన్ను ప్రయోజనాలు కూడా ఉంటుంటాయి. రూ.45 లక్షల లోపు గృహాన్ని కొనుగోలు చేసినట్లయితే వడ్డీ చెల్లింపుపై సంవత్సరానికి రూ.3.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. అసలు, స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ పై రూ.1.5 లక్షల పన్ను ప్రయోజనాలు పొందవచ్చు.
ఇదీ చదవండి: ఇళ్ల కొనుగోళ్లలో మారిన ట్రెండ్.. వాటికే ప్రాధాన్యం!
ఇదీ చదవండి: ఇల్లు కట్టుకోవాలా, కొనుక్కోవాలా? ఏది మేలు?
పన్ను ప్రయోజనాలు ఏంటి?
రుణం తీసుకునే మొత్తానికి మెచ్యురిటీ అనంతరం పన్నులు పోగా వచ్చే మొత్తాన్ని గణించండి. ప్రతి సంవత్సరం చెల్లించే గృహ రుణంపై వడ్డీని గణించండి. దీని ద్వారా వచ్చే సంవత్సరం వారీగా పన్ను ప్రయోజనాలను గణించండి. రుణం తీసుకున్నట్లయితే తిరిగి చెల్లిస్తున్న మొదట్లో వడ్డీ ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. పోనుపోనూ వడ్డీ తక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. రుణం పూర్తిగా చెల్లించే గడువులో వచ్చిన పూర్తి పన్ను ప్రయోజనాలను లెక్కించండి. పన్ను అనంతరం వచ్చిన వడ్డీ, రుణంపై వచ్చిన పూర్తి పన్ను ప్రయోజనాలను పోల్చి చూసుకోవాలి. దీని బట్టి రుణం లేదా పూర్తి చెల్లింపు అనేది నిర్ణయించుకోవచ్చు.
తెలుసుకోవాల్సిన అంశాలు..
స్వంత నిధులు ఉపయోగించినట్లయితే వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా ఈఎమ్ఐ, క్రెడిట్ స్కోరు, వడ్డీ రేట్ల గురించి చింతించాల్సిన అవసరం ఉండదు. ఒకేసారి చెల్లించటం వల్ల పన్ను ప్రయోజనాలు ఉండకపోవచ్చు. స్థిరాస్తిలో ఆశించిన వృద్ధి ఉండకపోవచ్చు. రుణం తీసుకున్నట్లయితే పేపర్ వర్క్ చేయాల్సి ఉంటుంది. చెల్లించాల్సిన వడ్డీ అసలు కంటే ఎక్కువ ఉండొచ్చు. పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. రుణ చెల్లింపు అనేది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ.
ఇవీ చదవండి: కలల ఇంటి నిర్మాణంలో ఖర్చు తగ్గించే మార్గాలు!