ETV Bharat / business

సరికొత్త హంగులతో యాపిల్​ ఐఓఎస్​ అప్​డేట్​​! - యాపిల్​ కొత్త ఫీచర్లు

ఐఫోన్ యూజర్స్‌కు గుడ్ న్యూస్‌. యాపిల్ త్వరలో కొత్త ఐఓఎస్‌ అప్‌డేట్‌ను తీసుకురానుందట. ఐఓఎస్‌ 15 పేరుతో తీసుకొస్తున్న అప్‌డేట్‌ను ఈ ఏడాది జూన్‌లో విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఈ ఓఎస్‌లో సరికొత్త ఫీచర్స్‌ని పరిచయం చేయనున్నారు. అయితే.. ఇది​ కొన్ని మోడల్స్​ని మాత్రం సపోర్ట్​ చేస్తుందని తెలుస్తోంది.

apple to launch ios15 found solution to face id lock
సరికొత్త హంగులతో యాపిల్​ ఐఓఎస్​ అప్​డెట్​​!
author img

By

Published : Feb 21, 2021, 7:09 PM IST

ఐఓఎస్​ 15 పేరుతో కొత్త అప్​డేట్​ను యాపిల్​ తీసుకురానుంది. ఈ ఏడాది జూన్‌లో జరగబోయే యాపిల్ 2021 వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్​లో‌ విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఐఓఎస్​ 14కి కొనసాగింపుగా వస్తున్న ఈ అప్​డేట్​లో సరికొత్త ఫీచర్స్‌ని పరిచయం చేయనున్నారు. అయితే ఈ కొత్త అప్‌డేట్‌ కొన్ని మోడల్స్‌ని మాత్రమే సపోర్ట్ చేస్తుందట. ఐఫోన్ ఎస్‌ఈ2, ఐఫోన్ 7, ఐఫోన్ 7ప్లస్, ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్‌, ఐఫోన్ ఎక్స్‌, ఐఫోన్ ఎక్స్‌ఆర్‌, ఐఫోన్ ఎక్స్‌ఎస్‌, ఐఫోన్ ఎక్స్‌ఎస్‌ మాక్స్‌, ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మాక్స్‌, ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మాక్స్‌ మోడల్స్‌ ఈ జాబితాలో ఉన్నాయి.

కేబుల్స్​ కోసం..

దీనితో పాటు యాపిల్ కంపెనీ యూజర్స్‌ కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఫోన్‌ ఛార్జింగ్ కోసం ఉపయోగించే లైటెనింగ్ కేబుల్స్‌ని మరింత మందంగా తయారుచేయనున్నట్లు సమాచారం. దీని వల్ల కేబుల్స్‌ ఎక్కువ కాలం పనిచేయడమే కాకుండా కేబుల్ మడతబెట్టినప్పుడు పాడవకుండా ఉంటుందని టెక్‌ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఐఫోన్ ఛార్జింగ్ కోసం ఉపయోగించే కేబుల్స్‌ అడాప్టర్‌ వద్ద కానీ, ఫోన్‌కు కనెక్ట్ అయ్యే చోట కానీ త్వరగా విరిగిపోతున్నాయి. కొత్త కేబుల్ ధర ఎక్కువగా ఉండటం, ఫోన్‌తో పాటు వచ్చే కేబుల్ త్వరగా పాడవుతుండటం వల్ల యూజర్స్ నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో మరింత దృఢంగా కొత్త కేబుల్స్ తీసుకురావాలని యాపిల్ నిర్ణయించింది.

apple update
యాపిల్​ ఛార్జింగ్​ కేబుల్​

ఫేస్‌ఐడీ సమస్యకు పరిష్కారం..

ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఐఫోన్ యూజర్స్‌ ఎదుర్కొంటున్న సమస్య ఫేస్‌ఐడీ లాక్. తొలిసారి ఈ ఫీచర్‌ని ఐఫోన్లలో పరిచయం చేసినప్పుడు ముఖాలను గుర్తించడంలో సమస్యలు తలెత్తాయి. తర్వాత వాటిని పరిష్కరించినప్పటికీ, కొవిడ్‌-19 పరిస్థితులతో మాస్క్‌ ధరించడం తప్పనిసరి కావడంతో మరోసారి ఫేస్ఐడీ సమస్య తెరమీదికి వచ్చింది. ఫేస్‌ఐడీకి ప్రత్యామ్నాయంగా చాలా మంది ఐఫోన్ యూజర్స్‌.. లాక్‌ కోడ్, ఫింగర్‌ ప్రింట్ స్కానర్‌ ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫేస్‌ఐడీ సమస్యకు యాపిల్ పరిష్కారాన్ని కనుగొంది. ఇందులో భాగంగా యాపిల్ వాచ్‌తో ఫేస్‌ఐడీ ఉన్న ఐఫోన్లను ఓపెన్‌ చెయ్యొచ్చట.

మాస్క్‌ ధరించినప్పుడు ఐఫోన్ యూజర్‌ ముఖాన్ని పూర్తిగా స్కాన్ చెయ్యలేదు. దీంతో ఐఫోన్‌ యాపిల్‌ వాచ్‌కు పింగ్ (నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేషన్ యుటిలిటీ)ని పంపిస్తుంది. దాంతో యాపిల్ వాచ్‌ ఓపెన్ అయితే వాచ్‌ నుంచి కూడా మరో పింగ్ ఐఫోన్‌ వస్తుంది. అలా పింగ్ ఫోన్ నుంచి వాచ్‌కి, వాచ్‌ నుంచి ఫోన్‌కి వస్తే ఐఫోన్ ఫేస్‌ఐడీ అన్‌‌లాక్ అవుతుంది. అయితే ఈ ఫీచర్ పనిచేయాలంటే ఐఫోన్ ఐఓఎస్‌ 14.5 ఓఎస్‌తో, వాచ్‌ ఓఎస్‌7.4తో పనిచేస్తుండాలి. ప్రస్తుతం ఈ ఫీచర్‌ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. త్వరలోనే పూర్తి స్థాయిలో యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొస్తారు.

ఇదీ చదవండి:ఐఫోన్‌ వర్సెస్​ ఆండ్రాయిడ్‌: ఎవరు గెలిచారు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.