కొవిడ్ నిర్ధరణ కోసం సీఎస్ఐఆర్, సీసీఎంబీ, అపోలో ఆస్పత్రి అభివృద్ధి చేసిన ర్యాపిడ్ ఆర్టీ-పీసీఆర్ టెస్టును వాణిజ్యపరంగా ఉపయోగించుకునేలా ఒప్పందం కుదిరింది. దీనికి సంబంధించి భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నట్లు అపోలో ఆస్పత్రి ప్రకటించింది.
ఈ ర్యాపిడ్, సురక్షితమైన, కాస్ట్ ఎఫెక్టివ్ టెస్టు దేశ వ్యాప్తంగా అపోలో ఆసుపత్రుల నెట్వర్క్ ద్వారా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం అనుసరిస్తున్న టెస్టులతో పోలిస్తే మానవ ఉపయోగం, సమయం 40 నుంచి 50 శాతం ఆదా అవుతుందని వెల్లడించింది.
ఇదీ చూడండి: ఐటీ గ్రిడ్ పాలసీ మార్గదర్శకాలు ప్రకటించిన ప్రభుత్వం