ETV Bharat / business

ట్విట్టర్‌కు పోటీగా 'కూ'తకొచ్చింది..! - కూ యాప్

ఆత్మనిర్భర్​ కింద గతేడాది నుంచి వివిధ యాప్​లు విపణిలో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ సామాజిక మాధ్యమం అయిన ట్విట్టర్​కు పోటీగా 'కూ' అనే యాప్​ వచ్చింది. ఈ యాప్​లో అందరూ చేరండి అంటూ ప్రస్తుతం కేంద్ర మంత్రులు ప్రచారం చేస్తున్నారు. ఈ యాప్​ను ప్రభుత్వం ఎందుకు ప్రచారం చేస్తోందో తెలుసుకోవాలంటే కథనం చదవాల్సిందే.

koo, twitter
ట్విటర్‌కు పోటీగా ‘కూ’తకొచ్చింది..!
author img

By

Published : Feb 10, 2021, 8:21 PM IST

''నేను 'కూ' యాప్‌లోకి వచ్చాను. మీరు కూడా చేరండి'' ట్విట్టర్‌ వేదికగా తన ఫాలోవర్లకు పిలుపునిచ్చారు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌. ఆ వెంటనే పలువురు మంత్రులు, మంత్రిత్వ శాఖలు కూడా 'కూ'లో చేరండంటూ తమ ట్విట్టర్‌ ఖాతాల్లో లింక్‌లు షేర్ చేశారు. మరి ఇంతమంది చెబుతున్న ఈ యాప్‌ ఏంటీ..? ట్విట్టర్‌ను కాదని ప్రభుత్వం ఎందుకు 'కూ'తపెడుతోంది..?

'కూ' సృష్టికర్తలు వీరే..

బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ కంపెనీ బాంబినేట్ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈఓ అప్రమేయ రాధాకృష్ణ, మరో వ్యాపారవేత్త మయాంక్‌ బిద్వత్క సంయుక్తంగా ఈ యాప్‌ను రూపొందించారు. 2020 మార్చిలో విడుదల చేశారు. ట్విట్టర్​‌ను పోలినట్లుగా ఉండే ఈ యాప్‌ అతి త్వరలోనే నెటిజన్లకు చేరువైంది. గతేడాది ఆగస్టులో ప్రభుత్వం నిర్వహించిన ఆత్మనిర్భర్‌ యాప్‌ ఛాలెంజ్‌లో ఉత్తమ సోషల్‌మీడియా యాప్‌గా నిలిచింది.

మంత్రులు.. ప్రభుత్వ విభాగాలకు ఖాతాలు..

ప్రస్తుతం ప్లేస్టోర్‌లో 4.7 స్టార్‌ రేటింగ్‌ ఉన్న 'కూ' యాప్‌ను ఇప్పటికే 25 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. సామాన్యుల దగ్గర్నుంచి మంత్రుల వరకు ఈ ప్లాట్‌ఫాంలో చేరారు. కేంద్రమంత్రులు పీయూష్‌ గోయల్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, ఎంపీలు తేజస్వీ సూర్య, శోభ కరంద్లాజేలతో పాటు ప్రభుత్వ విభాగాలైన నీతి ఆయోగ్‌, మైగవర్నమెంట్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, ఇండియా పోస్ట్‌, నేషనల్‌ ఇన్‌ఫార్మాటిక్స్‌ సెంటర్‌, సెంట్రల్‌ బోర్డ్‌ ఆప్‌ ఇండైరెక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ తదితర విభాగాలకు ఇందులో ఖాతాలున్నాయి. మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ వంటి ప్రముఖులు యాప్‌లో చేరడం విశేషం.

ట్విట్టర్​‌కు పోటీగా..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం పిలుపునిస్తున్న 'ఆత్మనిర్భర్‌ భారత్‌'లో భాగంగా రూపొందించిన ఈ యాప్‌ అనతికాలంలోనే దేశీ ట్విట్టర్‌గా గుర్తింపు పొందింది. ప్రధాని మోదీ స్వయంగా తన మన్‌ కీ బాత్‌లో ఈ యాప్‌ గురించి ప్రస్తావించడం, భారతీయులందరూ 'కూ'ను వినియోగించాలని ప్రోత్సాహం అందేసరికి దీనికి మరింత ప్రాధాన్యం లభించింది. దాదాపు ట్విట్టర్‌లాగే ఉండే ఈ యాప్‌లో ట్విట్టర్‌లో లేని కొన్ని అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా హిందీతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ఈ యాప్‌ అందుబాటులో ఉండటం వల్ల భారత యూజర్లకు వేగంగా చేరువైంది. ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఒరియా, పంజాబీ, అస్సామీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, హిందీ భాషల్లో ఈ యాప్‌ అందుబాటులో ఉంది.

ప్రభుత్వం ప్రచారం ఎందుకు..?

రైతుల ఆందోళన విషయంలో ట్విట్టర్​‌, కేంద్ర ప్రభుత్వం మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్న సమయంలో కేంద్రమంత్రులు 'కూ' యాప్‌కు ప్రచారం చేస్తుండం ప్రాధాన్యం సంతరించుకుంది. రైతుల ఆందోళనను తప్పుదోవ పట్టించేలా, ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా రెచ్చగొట్టేలా ఉన్న ట్వీట్లు/ఖాతాలను తొలగించాలంటూ ఇటీవల కేంద్ర ఐటీ శాఖ ట్విట్టర్‌ను ఆదేశించింది. అయితే తొలుత ఆయా ఖాతాలను తొలగించిన ట్విట్టర్‌.. కొన్ని గంటల తర్వాత మళ్లీ వాటిని పునరుద్ధరించడం వివాదానికి కారణమైంది. ట్విట్టర్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కేంద్రం.. తమ ఆదేశాలను పాటించకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. అయితే ట్విట్టర్‌ మాత్రం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు తాము ప్రాధాన్యమిస్తామని చెప్పడం గమనార్హం. అయితే ట్విట్టర్‌పై భారత యూజర్లు కూడా గుర్రుగానే ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని యాప్‌లు..

ట్విట్టర్‌కు పోటీగా గతంలోనూ చాలా యాప్‌లు వచ్చాయి. 2016లో ఓ జర్మనీ కోడర్‌ 'మాస్టోడన్‌' పేరుతో మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ను రూపొందించారు. అనంతరం గతేడాది 'టూటర్‌', 'స్వదేశీ' లాంటి ట్విట్టర్‌ తరహా యాప్‌లు కూడా వచ్చాయి. అయితే వీటిలో ఏవి కూడా ట్విట్టర్‌ అంత పాపులారిటీ సంపాదించలేకపోయాయి. కానీ వాటికి భిన్నంగా 'కూ' మాత్రం నెట్టింట దూసుకెళ్తున్నట్లే కన్పిస్తోంది. మరి భారత్‌లో ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా 'కూ'త గట్టిగా ఉంటుందో లేదో చూడాలి..!

ఇదీ చదవండి : 'ప్రపంచానికి ఆశాకిరణంగా భారత్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.