అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ (Prime Annual subscription) ఇప్పుడు మరింత ప్రియం కానుంది. ప్రైమ్ వీడియో వార్షిక సబ్‌స్క్రిప్షన్ ధరలు 50 శాతం పెరగనున్నాయి. ప్రస్తుతం ప్రైమ్(Amazon Prime) సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలంటే రూ.999 చెల్లిస్తే సరిపోతుంది. అయితే త్వరలో ఈ మెంబర్‌షిప్‌కు రూ.1,499 చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ, త్రైమాసిక ప్లాన్లకు కూడా ధరల పెంపు వర్తించనున్నట్లు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. దీంతో నెలవారి మెంబర్‌షిప్‌కు(amazon prime subscription price) రూ.129 చెల్లించాల్సి ఉండగా.. త్వరలో రూ.179 కానుంది. అలాగే ప్రస్తుతం మూడు నెలల కాలానికి చెల్లించే రూ.329.. రూ.459కి పెరగనుంది. అయితే ఈ ధరలు ఎప్పటి నుంచి పెరుగుతాయన్న స్పష్టత లేదు.
ప్లాన్ | ప్రస్తుత ధర | కొత్త ధర(మారితే) |
నెలవారీ | రూ.129 | రూ.179 |
మూడు నెలలకు | రూ.329 | రూ.459 |
వార్షిక ప్లాన్ | రూ.999 | రూ.1499 |
భారత్‌లో అమెజాన్ ప్రైమ్‌ను (amazon prime membership) ప్రారంభించి ఐదేళ్లు అయిందని.. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని అమెజాన్ చెబుతోంది. ప్రస్తుతం అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ ముగిసిన తర్వాత కొత్త సబ్‌స్క్రిప్షన్ ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
టెలికామ్ ప్లాన్ ద్వారా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్న కస్టమర్లకు కూడా ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ధరలు(amazon prime membership) పెరగనున్నాయి.
ఇదీ చూడండి: Facebook Name Change: ఫేస్‌బుక్ పేరు మారనుందా..?