ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సేవలకు అంతరాయం(Amazon outage) ఏర్పడింది. భారత్ సహా ప్రపంచ దేశాల్లో అమెజాన్ సైట్ను వినియోగించుకునేందుకు యూజర్లు ఇబ్బందిపడ్డారు. అయితే ఇందుకు కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం సర్వీసును పునరుద్ధరించేందుకు అమెజాన్ బృందం చర్యలు చేపట్టింది.
భారత్(Amazon India), అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, సింగపూర్ దేశాల్లో అమెజాన్ సేవలు నిలిచిపోయాయి. ఈ ఏడాది జూన్ చివర్లో కూడా అమెజాన్లో ఇదే సమస్య ఎదురైంది.
ఇటీవలి కాలంలో అనేక దిగ్గజ సంస్థలు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. కొద్ది రోజుల ముందే ట్విట్టర్లోనూ ఈ సమస్యలు వెలుగులోకి వచ్చాయి.
ఇదీ చూడండి:- Internet outage: ఆగిన వెబ్సైట్లు, యాప్లు