ETV Bharat / business

'కార్పొరేట్లకు రూ. 4.64 లక్షల కోట్ల పన్ను రాయితీలు'

author img

By

Published : Mar 10, 2021, 5:29 AM IST

గడిచిన ఐదేళ్లలో కార్పొరేట్ సంస్థలకు రూ. 4.64 లక్షల కోట్ల పన్ను రాయితీలు కల్పించినట్లు కేంద్రం తెలిపింది. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమధానం ఇచ్చింది.

4.64 lakh crores of tax benefits were given to corporates in last 5 years
'కార్పొరేట్లకు రూ. 4.64 లక్షల కోట్ల పన్ను రాయితీలు'

కార్పొరేట్‌ సంస్థలకు గత ఐదేళ్లలో రూ.4.64 లక్షల కోట్ల పన్ను రాయితీలు కల్పించినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ తెలిపారు. దీనివల్ల ప్రభుత్వం ఆ మేరకు ఆదాయం కోల్పోవాల్సి వచ్చినట్లు మంగళవారం రాజ్యసభలో సీపీఎం సభ్యుడు కె.కె.రాగేశ్‌ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

"గత ఐదేళ్లలో కార్పొరేట్‌ పన్ను చెల్లింపుదారులకు ఇచ్చిన పన్ను రాయితీల వల్ల ప్రభుత్వ ఆదాయంపై పడిన ప్రభావాన్ని బడ్జెట్‌ పత్రాల రూపంలో పార్లమెంటుకు సమర్పించాం. ప్రాంతీయ అసమానతలు తగ్గించేందుకు వీలుగా ప్రత్యేకంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు పన్ను రాయితీలు ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగాల కల్పనకు ఊతమిచ్చేందుకూ వివిధ ప్రోత్సాహకాలు అందిస్తుంటారు. ఆదాయ పన్ను చట్టం-1961లోని సెక్షన్‌ 115జేబీ కింద 15% చొప్పున ‘మినిమం ఆల్టర్నేటివ్‌ ట్యాక్స్‌’ (మ్యాట్‌)ను విధిస్తున్నాం. రాయితీలు, మినహాయింపులు పొందాక కార్పొరేట్‌ సంస్థలు చెల్లించాల్సిన ఆదాయ పన్ను.. మ్యాట్‌ కంటే తక్కువగా ఉంటే అవి విధిగా ఈ కనీస ప్రత్యామ్నాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది" అని కేంద్రమంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ తెలిపారు.

గత ఐదేళ్లలో కార్పొరేట్‌ సంస్థలకు ఇచ్చిన పన్ను ప్రోత్సాహకాలు, దానివల్ల ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం ఇలా.. (రూ.కోట్లలో)

CORP-TAX
పన్ను రాయితీల వివరాలు

ఇదీ చదవండి: ఎన్నికల తర్వాత భారీ స్థాయిలో పెట్రో బాదుడు?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.