ETV Bharat / business

ఈ సారైనా కనీస పింఛను రూ.3 వేలకు పెరిగేనా? - పింఛను పెంపు

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌ఓ) కింద దేశవ్యాప్తంగా విశ్రాంత ఉద్యోగులు, కార్మికులకు కనీస పింఛను పెరుగుదల తీరని కలగా మిగులుతోంది. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న అవసరాల మేరకు కనీస పింఛను పెంపు సాధ్యాసాధ్యాలపై ఏడాదిన్నర క్రితం ఉన్నతస్థాయి కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చలు తప్ప, అడుగులు పడటం లేదు.

EPFO
పింఛను
author img

By

Published : Mar 2, 2020, 7:02 PM IST

Updated : Mar 3, 2020, 4:43 AM IST

కనీస పింఛను మొత్తాన్ని వెంటనే రూ.3 వేలకు పెంచాలని బోర్డులోని కార్మిక సంఘాలు కోరుతుండగా, అంత భారం భరించలేమని ఈపీఎఫ్‌ఓ చెబుతోంది. ఈ నేపథ్యంలో విశ్రాంత కార్మికులు, వితంతు పింఛనుదారులకు కనీసం రూ.2 వేలకు పెంచాలని ఉన్నతస్థాయి కమిటీ తెలిపింది. అవసరమైతే కేంద్రం నుంచి ఆర్థిక సహకారం తీసుకోవాలని సూచించింది.

గత రెండు ఈపీఎఫ్‌ సెంట్రల్‌ బోర్డు ట్రస్టీల సమావేశాల్లో కనీస పింఛను పెంపు అంశం చర్చకు వచ్చినప్పుడు.. ఆర్థిక శాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈపీఎఫ్‌ఓ బోర్డు ఛైర్మన్‌, కేంద్ర కార్మికశాఖ మంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటికీ నిర్ణయం జరగలేదు. మార్చి 5న జరిగే సమావేశంలోనైనా దీనిపై నిర్ణయం తీసుకుంటారని దాదాపు 44 లక్షల మంది పింఛనుదారులు ఎదురుచూస్తున్నారు.

EPFO
పింఛనుదారుల సంఖ్య

కేంద్రం బకాయిలు రూ.9,114 కోట్లు

ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్‌) కింద 1.16 శాతం వాటా కేంద్ర ప్రభుత్వం భరించాలి. ఈపీఎఫ్‌ఓ-95 చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి వాటా మేరకు కేంద్రం నిధులివ్వడంలేదు. ఈ బకాయిలు రూ.8,063 కోట్లకు చేరాయి. మరోవైపు కనీస పింఛను రూ.వెయ్యిగా నిర్ణయించినప్పుడు, ఆ మేరకు లోటు కింద చెల్లించాల్సిన నిధులు రూ.1,051 కోట్లుగా లెక్కతేలింది. ఈ మొత్తం కలిపి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు రూ.9,114 కోట్లకు చేరాయి.

EPFO
నిధి లోటు

ఇదీ చూడండి: 'వాహనం' పరుగు తీసేదెప్పుడు?

Last Updated : Mar 3, 2020, 4:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.