రాష్ట్రంలో విద్యారంగం పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ కాలేదన్నారు. ఇంటర్ జవాబు పత్రాలను కార్పోరేట్ ఉపాధ్యాయులతో మూల్యాంకనం చేయించారని ఆరోపించారు. ఇంటర్ ఫలితాల వ్యవహారంలో గ్లోబరీనా సంస్థను ప్రభుత్వం వెనకేసుకురావడం సిగ్గుచేటన్నారు. ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే ముఖ్యమంత్రి తీర్థయాత్రలకు వెళ్లడం పూర్తిగా బాధ్యతారాహిత్యమని లక్ష్మణ్ ధ్వజమెత్తారు.
మోదీ మరోసారి ప్రధాని కావడం ఖాయమని జోస్యం చెప్పారు. భాజపా అధికార పగ్గాలు చేపట్టాక.. ఉగ్రవాదం తగ్గుముఖం పట్టిందని, నిత్యావసర ధరలు దిగివచ్చాయని తెలిపారు. మే 23 తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్, తెదేపాలు పూర్తిగా కనుమరుగవుతాయన్నారు.
ప్రాంతీయ పార్టీలు కుటుంబ పాలనను, కులాలను పెంచి పోషిస్తున్నాయని మండిపడ్డారు. గతంలో కంటే తమ ఓట్లు, సీట్లు పెరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. వారణాసిలో మోదీకి వ్యతిరేకంగా నామినేషన్ వేసినవారందరూ తెరాస ఏజెంట్లేనని ఆరోపించారు.
ఇవీ చూడండి: బాబు, కేసీఆర్పై మోదీ 'యూటర్న్ పంచ్'