తెలంగాణలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసలో చేరడం సరికాదని ఆపార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దిల్లీలో కుంతియాతో సమావేశమయ్యారు. తెరాసలో సీఎల్పీ విలీనం, తదనంతర పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నిజాయతీ ఉంటే రాజీనామా చేసి తెరాస తరఫున పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. విలీనంపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె ఓడిపోవడమే ప్రజల్లో వారికున్న వ్యతిరేకతకు నిదర్శనమని కుంతియా స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : కాళేశ్వరం ప్రారంభానికి పక్క రాష్ట్రాల సీఎంల రాక