ETV Bharat / briefs

ప్రపంచకప్​ అందుకున్న రణ్​వీర్​సింగ్​..! - కపల్​దేవ్​ న్యూస్​

హరియాణా హరికేన్‌ కపిల్‌దేవ్‌ తొలి ప్రపంచకప్‌ను అందుకోవడం ప్రత్యక్షంగా ఎంత మంది చూసుంటారు? ఈ తరం క్రికెటర్లలో చాలామంది అప్పటికి పుట్టనేలేదు. ఇప్పుడున్న క్రికెట్‌ అభిమానుల్లో ఆ అద్భుత ఘట్టం వీక్షించింది అతి కొద్ది మందే. ఆ అపురూప సన్నివేశాన్ని మళ్లీ మన ముందుకు తీసుకొస్తున్న చిత్రం '83'.

This-Is-83--Ranveer-Singh-recreates-Kapil-Dev-holding-World-Cup
ప్రపంచకప్​ను అందుకున్న రణ్​వీర్​సింగ్​..!
author img

By

Published : Mar 7, 2020, 4:40 PM IST

Updated : Mar 7, 2020, 5:46 PM IST

1983 క్రికెట్ ప్రపంచకప్​ నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందుతున్న చిత్రం '83'. కబీర్‌ఖాన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కపిల్‌ పాత్రను రణ్‌వీర్‌ సింగ్‌, అతడి సతీమణి రోమి భాటియా పాత్రను దీపికా పదుకొణె పోషిస్తున్నారు. తాజాగా చిత్రబృందం 1983లో కపిల్‌దేవ్‌ ప్రపంచకప్‌ను అందుకుంటున్న సన్నివేశాన్ని పునఃసృష్టించింది.

This-Is-83--Ranveer-Singh-recreates-Kapil-Dev-holding-World-Cup
'83' సినిమాలోని దృశ్యం

రణ్‌వీర్‌, కబీర్‌, టెన్నిస్‌ ఆటగాడు మహేశ్‌ భూపతి ఆ చిత్రాన్ని శనివారం ఆవిష్కరించారు. '83' దుస్తులు, వస్తువులను అమ్మకానికి పెట్టారు. విడుదల చేసిన ఫొటోలో కపిల్‌దేవ్​గా రణ్‌వీర్‌ సరిగ్గా సరిపోయాడు. ఆ సన్నివేశం కూడా దానిని ప్రతిబింబించింది. ప్రస్తుతం ఈ చిత్రం నెట్టింట వైరల్‌గా మారింది.

ఇది చూడండి.. నాలో ఏ ప్రత్యేకతలు లేవు: హీరోయిన్ సారా అలీఖాన్

Last Updated : Mar 7, 2020, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.