బాల్య వివాహాలు, ఆడపిల్లలపై జరిగే హత్యాచారాలను ఆరికట్టేందుకు పోలీసులతోపాటు తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా పెట్టాలని వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్ హరిత సూచించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బాలల హక్కులు-చట్టాలపై హన్మకొండలో అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి తిరుమలాదేవీ, వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్ హరిత, పోలీసులు హజరయ్యారు. రోజురోజుకు చిన్న పిల్లలు, ఆడవారిపై అత్యాచారాలు పెరిగిపోతుండటం చాలా భాదకరమని అభిప్రాయపడ్డారు. పిల్లలు తెలుసుకోవాల్సిన విషయాలు, బాల్యవివాహల వల్ల కలిగే నష్టాలపై ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా అవగాహన కల్పిస్తామని వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్ హరిత తెలిపారు.
ఇవీ చూడండి: లెక్క తేల్చాలంటున్న అటవీ శాఖ!