ETV Bharat / briefs

మన అమ్మకు ఆదివారం సెలవిద్దాం... - HOLIDAY

'అమ్మ నా పుస్తకాలు ఎక్కడా...? ఆ సెల్ఫ్‌లో ఉన్నాయి చూడు.. ఏమే నా ఫైల్స్‌ ఏవి...? ఇదిగోనండీ.. తెస్తున్నాను..' ఇవి నిత్య జీవితంలో రోజూ ఉండేవే. ఇందులో ఏముంది అంటారా...! జీతం తీసుకోకుండా జీవింతాంతం మనకు పనిచేస్తున్నా...అమ్మకు ఆదివారం కూడా సెలవుండదు. వారంలో ఒక్క రోజైనా ఆమెకు విశ్రాంతినిచ్చి మాతృమూర్తికి సహాయపడదాం.

అమ్మకు ఆదివారం సెలవిద్దాం...
author img

By

Published : May 5, 2019, 12:15 PM IST

Updated : May 5, 2019, 2:35 PM IST

అందరికంటే ముందే మేల్కొని... చివరగా పడుకుంటుంది. రోజంతా కష్టపడుతుంది. స్వార్థం లేని సేవలందిస్తుంది. అందుకే ఆమె అందరికి అమ్మ అయింది. మాతృమూర్తి రుణం తీర్చుకోవాలంటే ఈ జన్మ సరిపోదు.. అమ్మకే అమ్మగా పుడితే తప్ప. ఇంతలా కష్టపడే అమ్మకు మన వంతుగా ఆదివారం సెలవిద్దామా...!

అమ్మంటే అందరికీ ఇష్టమే... అయినా తన మనసులోని భావాలను అర్థం చేసుకోం... సమయానికి మాత్రం కావాల్సినవి మన ముందుండాల్సిందే. కొంచెం ఆలస్యమైనా అరుస్తాం.. అలుగుతాం.. అంతేనా నేను తినను పో.. అని బెదిరిస్తాం. అది విన్న అమ్మ నా బిడ్డ తినకపోతే ఎలా అని ఆవేదన చెందుతుంది. వెంటనే అడిగింది తెచ్చిపెడుతుంది.

భర్త-పిల్లల మధ్య వారధి

ఇంట్లో వారందరూ తిన్న తర్వాత తింటుంది. బిడ్డ తినకపోతే అల్లాడిపోతుంది. పిల్లలు ఏదైనా కావాలంటే మొదట అమ్మనే అడుగుతారు. నువ్వే ఎలాగైనా నాన్నకు చెప్పాలని వేడుకుంటారు. తల్లి... అటు భర్తకు, ఇటు పిల్లలకు మధ్య వారధిగా ఉంటుంది. అంతేనా... నీకు ఏ కష్టం వచ్చినా తన కష్టంగా భావిస్తుంది.

అమ్మ బాధ పట్టదా..?

ఇంతలా మన గురించి ఆలోచించే అమ్మ బాధను మనం పట్టించుకుంటామా? లేదు... మన ప్రపంచం వేరు. అందులో అమ్మ ఉంటుంది కానీ ఆలోచించం. స్నేహితులతో షికార్లు వెళతాం... స్మార్ట్‌ఫోన్‌తో గేమ్స్‌, ముచ్చట్లు... ఎక్కడో ఉన్న ఫ్రెండ్‌ ఫోన్‌ చేస్తే తిన్నావా అంటూ పలకరిస్తాం... లేదా సందేశాలు పంపుతాం.. పక్కనే ఉన్న అమ్మను ఒక్కసారైనా తిన్నావా అని అడగం... !

నీకు కావాల్సినవి వండిపెడుతూ... నీ బట్టలు ఉతుకుతూ... నీకు జ్వరం వస్తే దగ్గరుండి సేవలు చేస్తూ.. రోజంతా నీ గురించే ఆలోచించే అమ్మకు... ఓ రోజు తనతో సమయాన్ని గడిపి... పనులను పంచుకుంటూ ఉంటే అమ్మ ఎంత సంతోషిస్తుందో ఆలోచించండి.

ఇదీ చూడండి: మీది ప్రేమేనా... ఓ సారి ఆలోచించుకోండి!

Intro:TG_NZB_03_05_GOVT_HOSPITAL_WATER_PROBLAM_PKG_C13 camera :manoj ( ) పెద్ద ఆసుపత్రి లో నీటి కష్టాలు మొదలయ్యాయి బోర్లలో నీటిమట్టం పడిపోవడం మున్సిపాలిటీ నుంచి రావాల్సిన నీరు రాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఒక్కొక్కసారి రాత్రి సమయంలో మూత్ర శాలకు వెళ్లేందుకు కూడా నీరు ఉండని పరిస్థితి నెలకొంది ..ఇక త్రాగునీటి కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి..loook VO: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో నీటి సమస్య అధికమైంది ఆసుపత్రి ప్రాంగణంలోని 3 బోర్లలో 2 పూర్తిగా గా ఎత్తిపోయాయి మున్సిపాలిటీ నుండి నీటి సరఫరా సమయం తగ్గించడంతో నీటి కష్టాలు మరింత పెరిగాయి...stop VO: ప్రతిరోజు జనరల్ ఆసుపత్రికి సుమారుగా మూడు నుంచి నాలుగు వేల మంది ప్రజలు వచ్చి వెళ్తుంటారు ఇలాంటి చోట తాగునీటికి సమస్య ఎక్కువ.. ప్రధానంగా వార్డులలో అసలు తాగునీరు సరఫరా సౌకర్యమే లేదు రోగులు వారి బంధువులు బయటికి వెళ్లి తాగునీటిని కొనుగోలు చేస్తున్నారు. ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్ర లో కొందరు నీళ్ల బాటిల్ నింపుకొని పెట్టుకుంటున్నారు మరి కొందరు ప్రైవేటు గా నీటిని కొనుగోలు చేస్తున్నారు అధికారులు స్పందించి తాగునీటి సౌకర్యం తాత్కాలికంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రోగులు పేర్కొంటున్నారు ....ఉదయం సమయంలో చలివేంద్రాలు ఇతర సౌకర్యాలు ఉన్నప్పటికీ రాత్రి సమయంలో లో మంచి నీరు లభించడం లేదు కనీసం రాత్రి సమయంలో లో అయినా తాగునీటిని అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు....stop VO: ఆసుపత్రి ప్రాంగణంలో లో జలధార ప్లాంట్ లో ఒక్క బాటిళ్లు ఒక రూపాయి కి విక్రయిస్తున్నారు నిర్వాహకులు అది కూడా ఉదయం పూట నే అందుబాటులో ఉంటుంది. రాజ సభ్యుడు డి శ్రీనివాస్ ఏర్పాటుచేసిన ఆర్ఓ ప్లాంట్ లో ఎప్పుడు నీరు వస్తుందో అక్కడ ఎవరికీ తెలియదు..... VO: ఏడంతస్తుల భవనం నుండి త్రాగు నీరు కోసం మెట్ల ద్వారా కిందికి రావాల్సిన పరిస్థితి ఉంది లిఫ్ట్ సౌకర్యం కూడా లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన వారి బంధువులు ఒకరు మంచినీళ్లు మోయడానికి ప్రత్యేకంగా ఉంటుండటం విశేషం..... అధికారులు తక్షణమే తాగునీటి సమస్య పరిష్కరించి ప్రతి అంతస్తులు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసేందుకు చర్యలు చర్యలు తీసుకోవాలి..... EVO; త్రాగునీటి సమస్య ఆసుపత్రి లో ఉంది. మొదటి నుంచే ఆసుపత్రిలోని ప్రతి అంతస్తులో ప్రత్యేకమైన తాగునీటి సరఫరా సౌకర్యం లేదు దానిపై ఇంజనీర్ల తోటి మాట్లాడి ప్రభుత్వానికి నివేదిక సమర్పించి అతి త్వరలోనే ప్రతి వార్డు లో ప్రతి అంతస్తులో నీరు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు సూపర్డెంట్ రాములు పేర్కొన్నారు....bytes byte1.... లింగంపల్లి సుధాకర్ రోగి బంధువు byte2.. అంజయ్య గ్రామం కొండాపూర్ byte3... రాజవ్వ గ్రామం కొండాపూర్ byte4... ఇలియాస్ నగర వాసి byte5......( జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్) రాములు

Body:ramakrishna

Conclusion:8106998398
Last Updated : May 5, 2019, 2:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.