పోయిన వారం వరకు క్వింటా ఉల్లి 300 నుంచి 670 రూపాయలు మాత్రమే ధర పలకడం వల్ల గిట్టుబాటు ధర లభించక చాలా మంది రైతులు తీవ్ర నష్టాన్ని చవి చూశారు. కొంతమంది రైతులు తక్కువకు అమ్ముకోలేక పొలాల దగ్గర నిల్వ ఉంచారు. ఫిబ్రవరిలో చలిగాలులకు మొలకెత్తిన ఉల్లితో, మార్చి నెల ప్రారంభంలో ఎండలు పెరిగి ఆరబెట్టిన గడ్డ సన్నబడటం వల్ల రెండు విధాలుగా నష్టాలపాలయ్యారు. ఈనెల చివరి వారంలో ఉల్లిగడ్డకు డిమాండ్ పెరగడం వల్ల ఆశించిన ధరలు ఉల్లి రైతులు పొందగలుగుతున్నారు.
ఇవీ చూడండి:'విద్యావంతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది'