మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం 'ఆర్.ఆర్.ఆర్' లో అల్లూరి సీతరామరాజుగా నటిస్తున్నాడు. లుక్ ఎలా ఉంటుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు... వరుణ్‌తేజ్ ట్వీట్ చేసిన ఫొటో ఆసక్తి కలిగిస్తోంది. చరణ్ కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. అల్లూరి గెటప్ ఇదేనా అని అభిమానులు చర్చించుకుంటున్నారు.
మరో హీరోగా ఎన్టీఆర్ 'కొమురం భీం' పాత్రలో కనిపించనున్నాడు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు కీరవాణి సంగీతమందిస్తున్నారు. వచ్చే ఏడాది జూలై 30న ఈ సినిమా విడుదల కానుంది.