ఇవీ చూడండి:పేదలకు ఏటా రూ.72వేల నగదు బదిలీ : రాహుల్
'ప్రగతి భవన్' పై తెరాసకు లేఖ: రజత్ - తెలంగాణ
ప్రగతి భవన్‌ను రాజకీయ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారన్న ఫిర్యాదుపై సీఈసీ ఆదేశాలతో తెరాసకు లేఖ రాశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ వెల్లడించారు.
'ప్రగతి భవన్' పై తెరాసకు లేఖ: రజత్
ప్రగతి భవన్లో రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న కాంగ్రెస్ ఫిర్యాదుపై ఈసీకి నివేదించామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్ తెలిపారు. వివరణ ఇవ్వాల్సిందిగా తెరాస పార్టీ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశామన్నారు. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించామని తెలిపారు. సీఎం కేసీఆర్‌పై విశ్వహిందూ పరిషత్ ఫిర్యాదును కూడా పరిశీలించామని, కేసీఆర్ వ్యాఖ్యల్లో ఎలాంటి ఉల్లంఘనలు లేవని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రూ.10 కోట్ల నగదు, రూ. రెండు కోట్ల విలువైన మద్యం, రూ. 2.45 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని రజత్‌కుమార్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి:పేదలకు ఏటా రూ.72వేల నగదు బదిలీ : రాహుల్