ఐపీఎల్లో మరో కెప్టెన్‌పై స్లో ఓవర్ రేటు కారణంగా జరిమానా విధించారు. ఆదివారం మ్యాచ్‌లో.. నెమ్మదిగా బౌలింగ్ చేయించిన కారణంగా రాజస్థాన్ కెప్టెన్ రహానేకు రూ.12 లక్షల ఫైన్ వేసింది ఐపీఎల్ యాజమాన్యం. చెన్నైతో జరిగిన ఈ పోరులో 8 పరుగుల తేడాతో రాయల్స్ ఓటమి పాలైంది. 75 పరుగులు చేసిన ధోని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఇది చదవండి:ఐపీఎల్లో స్లో ఓవర్ రేటు- రోహిత్‌కు ఫైన్
రాజస్థాన్ రాయల్స్ తొలి తప్పిదంగా భావించి జట్టు కెప్టెన్ రహానేకు రూ.12 లక్షల జరిమానా విధించాం -ఐపీఎల్ యాజమాన్యం
తర్వాతి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సొంతగడ్డపై తలపడనుంది రాజస్థాన్.
శనివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ స్లో ఓవర్ రేట్ నమోదు చేశాడు. అతడికీ రూ.12 లక్షల జరిమానా విధించింది ఐపీఎల్.
ఇవీ చదవండి: