పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో శాంతిభద్రతలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు డీసీపీ సుదర్శన్‌గౌడ్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాల సహాయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. లెక్కింపు కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని హెచ్చరించారు. ఏవైనా అభ్యంతరాలుంటే... అందుబాటులో ఉన్న ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. డ్రోన్ కెమెరాల సహాయంతో ప్రతీ కదలికను ప్రత్యక్షంగా పరిశీలిస్తామంటున్న పెద్దపల్లి డీసీపీ సుదర్శన్‌గౌడ్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి అలీముద్దిన్ ముఖాముఖి..
ఇవీ చూడండి: నగరంలో వరుణుడు... వెంటే గాలి...!