జెనీవా వేదికగా జరిగిన ఐరాస మానవ హక్కుల కమిషన్ 43వ సమావేశంలో పాకిస్థాన్‌కు దీటుగా సమాధానం చెప్పింది భారత్. మానవ హక్కల పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న సమావేశాన్ని పాక్ రాజకీయం చేస్తోందని ఆరోపించింది. అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను దోషిగా చూపిస్తూ ఉద్దేశపూర్వకంగా ఆందోళనలు చేస్తోందని యూఎన్హెచ్ఆర్సీలో భారత విదేశాంగ తొలి కార్యదర్శి విమర్శ్ ఆర్యన్ విమర్శించారు.
"జమ్ముకశ్మీర్‌లోని సైనికులు, ప్రజలకు హక్కులకు ఉగ్రవాదులతోనే ముప్పు ఉంది. పాక్ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదమే ఇందుకు కారణం. భారత్‌లో కశ్మీర్ ఎప్పటికీ అంతర్భాగంగానే ఉంటుంది. దీనిపై పాక్ ఆశలు వదిలేసుకుంటే మంచిది."
- విమర్శ్ ఆర్యన్, యూఎన్హెచ్ఆర్సీలో భారత తొలి కార్యదర్శి