ETV Bharat / briefs

వింత ఆచారం: పాడేరు మన్యంలో పదేళ్లకే పెళ్లి

ఓ ఇంటిలో ఆకస్మాత్తుగా పందిరి వేశారు. ఇళ్లంతా చుట్టాలతో నిండిపోయింది. డప్పు వాయిద్యాలు, పాటల హోరుతో కుటుంబ సభ్యులంతా జోరు మీదున్నారు. ఏంటా అని వెళ్లి చూస్తే అప్పుడు అర్థమైంది..అక్కడ పెళ్లని. సరే పెళ్లి కొడుకెక్కడ అని ఆరా తీస్తే..తెలిసింది..10 ఏళ్ల బాలుడని. ఇంకా బాల్య వివాహాలు జరుగుతున్నాయా? అనే పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఆ బాలుడికి పెళ్లీ చేసింది ఎవరితోనో తెలుసా!

author img

By

Published : Jun 27, 2019, 9:14 AM IST

పదేళ్లయితే చాలు... పెళ్లే

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ మన్యంలో 10 ఏళ్ల బాలుడికి పెళ్లి చేస్తున్న దృశ్యం కంట పడింది. ఈ రోజుల్లోనూ బాల్య వివాహాల అని ముక్కున వెలేసుకునే పరిస్థితి. పూర్వంలో జరిగిన ఇలాంటి పెళ్లిల్లు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివాసుల సంప్రదాయాలు, వారి మూఢ నమ్మకాల కారణంగానే నేటికి చిన్నపిల్లలు పెళ్లి పీఠలెక్కాల్సి వస్తోంది.

విశాఖ పాడేరు మన్యంలో ఇలా చిన్న పిల్లలకు పెళ్లిల్లు చేసే సంస్కృతి కొనసాగుతున్నా...ఆపడానికి ఎవరు ముందుకు రావడం లేదు. కాలం మారినా..మనుషులు మాత్రం పాత పద్ధతినే కొనసాగిస్తున్నారు. కంప్యూటర్ కాలంలో కూడా ఈ పెళ్లిళ్లకు కారణాలేంటీ అని ఆరా తీస్తే... అనాదిగా వస్తున్న గిరిజన సంప్రదాయమనే సమాధానం చెబుతున్నారు. అయితే వారికి పెళ్లి చేసేది.. ఏ అమ్మాయితోనో కాదు. ప్రకృతితో. అవును. చెట్టుతో ఇలా పదేళ్ల బాలుడికి పెళ్లి చేయడం అక్కడ సంప్రదాయం.

పదేళ్లయితే చాలు... పెళ్లే

తాము అనుకున్నది ఫలిస్తే.. తమ పిల్లవాడికి దారి పెళ్లి చేస్తామని గిరిజనులు దేవతలకు మొక్కుకుంటారు. పంతులు సూచించిన ముహూర్తం ప్రకారంగా ఇంటి బయట పందిరి వేసి ప్రతి కర్ర స్తంభానికి కుండలు కట్టి అలంకరిస్తారు. ఇలాంటి పందిరి ఊరి పొలిమేరలో కట్టి ఉంచుతారు. గిరిజన వేడుకల్లో భాగంగా 10 ఏళ్ల బాలుడికి తెల్లని వస్త్రం ధరింపజేసి తలపాగా చుట్టి పంతులు పూజ చేసి ఊరి చివరనున్న పెళ్లి పందిరి వద్దకు తీసుకు వస్తారు. అక్కడ ప్రకృతితో పెళ్లి తంతు నిర్వహించి నృత్యాలు చేస్తూ మొక్కులు తీర్చుకుంటారు. అనంతరం ఇంటి వద్ద వివాహ విందు ఏర్పాటు చేస్తారు. ఇంతటితో బాలుడికి వివాహం అయిపోయినట్లే.

పెళ్లి చేసుకునే వయసు వచ్చిన తర్వాత...అబ్బాయితో అమ్మాయికి తాళి కట్టిస్తారంతే. పదేళ్ల వయసులో చేసినట్లుగా...పెళ్లి పందిరి..భాజా భజాంత్రీలు ఏముండవు. అమ్మాయి, అబ్బాయిని దగ్గరున్న గుడికి తీసుకెళ్లి...తాళి కట్టించి చిన్న విందు ఏర్పాటు చేసుకుంటారు. ఇదీ వారి సంప్రదాయం!

ఇవీ చూడండి: చారిత్రక భవన సముదాయంలో నూతన అసెంబ్లీ..!

Srinagarn (J and K), June 26 (ANI): Home Minister Amit Shah arrived in Srinagar on Wednesday. Jammu and Kashmir governor Satya Pal Malik received Home Minister at airport. Amit shah is on a 2-day visit to the state, where he will review overall security situation. He will also discuss security arrangements for Amarnath Yatra.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.