పదో తరగతి ఫలితాలు విడుదలైన పది రోజుల వరకూ ఎలాంటి ప్రకటనలు ఇవ్వకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జన విజ్ఞాన వేదిక డిమాండ్ చేసింది. మార్కులు, ర్యాంకులు కాదు పాస్ అయినా.. భవిష్యత్తు ఉంటుందని, రివ్వూ చేసిన తర్వాతనే మార్కులు వెల్లడించాలన్నారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నేటి విద్యా విధానం... విద్యార్థులపై ఒత్తిడి అనే అంశంపై సమావేశం ఏర్పాటు చేసి కరపత్రాలను విడుదల చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంవీ ఫౌండేషన్ ప్రతినిధి ప్రకాశ్, తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పగడాల లక్ష్మయ్య, సామాజిక కార్యకర్త రాజ్‌ధీర్, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అందె సత్యం, ప్రధాన కార్యదర్శి వరప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: జబ్బు చేసిందా.. ఇక ఇంట్లోనే చికిత్స