ETV Bharat / briefs

అమ్మ ప్రేమను అందరూ గౌరవించాల్సిందే

author img

By

Published : May 12, 2019, 9:26 AM IST

Updated : May 12, 2019, 11:35 AM IST

నవమాసాలు మోసి పురిటి నొప్పుల బాధననుభవించి పిల్లలకు జన్మనిస్తుంది... పుట్టినప్పటి నుంచి చనిపోయే దాకా బిడ్డల సంతోషం కోసం తన జీవితాన్నే దారపోస్తుంది. అలాంటి అమ్మ ప్రేమను అందరూ ఆస్వాదించాల్సిందే... గౌరవించాల్సిందే.

అమ్మ ప్రేమను అందరూ గౌరవించాల్సిందే
అమ్మ ప్రేమను అందరూ గౌరవించాల్సిందే

అన్ని దినోత్సవాల్లాగే అమ్మను పూజించడానికి కూడా ఓ రోజంటూ ఉంది. అదే అంతర్జాతీయ మాతృదినోత్సవం. మన దేశంలో మే నెల రెండో ఆదివారం మాతృదినోత్సవంగా నిర్ణయించారు. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, వాత్సల్యం, ఆప్యాయత, అనురాగం చూపించడంలో కొడుకుల కంటే కుమార్తెలే ముందుంటారనేది ఎవరూ కాదనలేని వాస్తవం.

కూతురికి పెళ్లి చేసి ఎంతో కష్టంగా, మనసును రాయి చేసుకొని అత్తారింటికి పంపుతుంది. తన బిడ్డకు పిల్లలు పుట్టినా... ఆ అమ్మకి మాత్రం తన కూతురు చిన్నపిల్లలాగే కనిపిస్తుంది. అలాగే ముద్దు చేస్తుంది. చనిపోయే వరకు తన పిల్లలే లోకంగా జీవిస్తుంది. కూతురు కూడా అంతే తను ఎంతో గారాబంగా పెరిగి మెట్టినింటికి వస్తుంది. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ప్రేమకు దూరంగా ఉంటూ బాధపడుతూనే ఉంటుంది.

రోజు రోజుకీ పెడధోరణులు పెరుగుతున్న నేటి ఆధునిక యుగంలో కొందరు జన్మనిచ్చిన అమ్మనే మరిచిపోతున్నారు. బాల్యం నుంచి నడక, నడత నేర్పించిన మాతృమూర్తిని భారంగా భావిస్తున్నారు. జీవిత చరమాంకంలో ఉన్న తల్లిదండ్రులను ఎలాగైనా వదిలించుకోవాలని చూస్తున్నారు. పట్టెడు అన్నం పెట్టలేక వృద్ధాశ్రమాలకు తరలిస్తున్నారు. మరికొందరు ఆస్తులు, అంతస్తుల కోసం తల్లిదండ్రులపై దాడులు, హత్యలకు పాల్పడుతున్నారు.

ఇలాంటివన్నీ తగ్గి తల్లిదండ్రుల మీద ప్రేమ, గౌరవం ఏర్పడాలంటే... చిన్నప్పటి నుంచే పిల్లలకు మన సంస్కృతి, సంప్రదాయాలు నేర్పించాలి. కుటుంబ విలువలను తెలియజెప్పాలి. డే కేర్ సెంటర్లు, హాస్టళ్లలో ఉంచకుండా ఇంట్లోనే ఉంచుతూ పెద్దవాళ్లకు అప్పగించాలి.

Intro:Body:Conclusion:
Last Updated : May 12, 2019, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.