పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం ఓ అబద్ధాల దుకాణమని కాంగ్రెస్ విమర్శించింది. మోదీ ప్రసంగాలలో మాటల్లో తప్పుడు, కల్పిత కథలే దర్శనమిచ్చాయని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ఎద్దేవా చేశారు. రఫేల్‌లో అక్రమాలు, సరిహద్దులో సైనికుల మృతికి కారణమైన మోదీకి జాతీయ భద్రతపై మాట్లాడే హక్కు లేదని దుయ్యబట్టారు.
"సభలో ఎప్పటిలాగే మోదీ సుదీర్ఘ ప్రసంగం చేశారు. మాట్లాడటం మినహా ఈ ఐదేళ్లలో ఆయన చేసిందేమీ లేదు. ఆయన ప్రధానమంత్రి కాదు. అసత్యాల ప్రచార మంత్రి. 70 ఏళ్లలో భారత్‌కు దొరికిన మొదటి ప్రచార మంత్రి మోదీనే. ప్రధానిని పనికిరాని కరెన్సీగా ప్రజలు పక్కన పెట్టారు. మోదీవన్నీ తప్పుడు, కల్పిత కథలే. ఆయనదొక అబద్ధాల దుకాణం. ఎన్నికలకు 60 రోజులు కూడా లేవు. ఇప్పటికైనా ఆయన నిజాలు మాట్లాడితే ప్రజలు క్షమిస్తారు. "
- రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి