కాంగ్రెస్, భాజపా నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి దేశమంతా చర్చించుకుంటున్నా.. ప్రతిపక్షాల వాదన మారలేదన్నారు. ప్రాణహిత చేవెళ్లలో తట్టెడు మట్టి కూడా కాంగ్రెస్ హయాంలో తీయలేదని ఆరోపించారు. భట్టి విక్రమార్కను సీఎల్పీ నేతగా ఎన్నుకోవడం ఆ పార్టీ నేతలకే ఇష్టంలేదన్నారు. ఫెడరల్ ప్రంట్ కోసం కేంద్ర ప్రభుత్వం దిగిపోవాలని తామెప్పుడూ కోరుకోలేదని తలసాని స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు హైదరాబాద్ అడ్డాగా మారిందన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టారు.
ఇవీ చూడండి: వేగంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ పనులు