ETV Bharat / briefs

'వేతనాలు అందకపోతే... ఆందోళన ఉద్ధృతం' - సంగారెడ్డి

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​లో మున్సిపల్​ కార్మికులు ఆందోళనకు దిగారు. మూడు నెలలుగా జీతాలు అందడం లేదని మున్సిపల్​ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. 10వ తేదీలోపు వేతనాలు అందకపోతే... ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

'వేతనాలు అందకపోతే... ఆందోళన ఉద్ధృతం'
author img

By

Published : Apr 2, 2019, 8:07 PM IST

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మున్సిపాలిటీలో మున్సిపల్​ కార్మికులు వేతనాలు అందడం లేదని ఆందోళనకు దిగారు. గత మూడు నెలలుగా వేతనాలు అందడం లేదంటూ... సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మున్సిపల్​ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. వేతనాలు రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

'వేతనాలు అందకపోతే... ఆందోళన ఉద్ధృతం'

దీనిపై స్పందించిన మున్సిపల్​ కమిషనర్​ వేమనా రెడ్డి రెండు నెలల వేతనాలు కార్మికుల బ్యాంకు ఖాతాల్లో వేశామని స్పష్టం చేశారు. ఏడాది ముగింపు మార్చి నెల కావడం వల్ల వారికి చేరుకోవడం ఆలస్యమైందని తెలిపారు. మరో రెండు రోజుల్లో అందుతాయని వారికి హామీనిచ్చారు.

ఈనెల 10వ తేదీలోపు వేతనాలు అందకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని కార్మిక సంఘ నాయకులు హెచ్చరించారు.

Intro:hyd_tg_14_02_ameenpur_muncipal_karmikula_andolana_ab_C10
Lsnraju : 9394450162
యాంకర్:

Body:పార్లమెంటు ఎన్నికల సమయంలో లో మున్సిపల్ కార్మికులు వేతనాలు అందడం లేదని ఆందోళనకు దిగిన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ లో జరిగింది గత మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు అంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు వేతనాలు రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ వేమనా రెడ్డి రెండు నెలల వేతనాలు కార్మికుల బ్యాంకు ఖాతాల్లో వేశామని మార్చి నెల కావడంతో వారికి చేరుకోవడం ఆలస్యమైందని తెలిపారు మరో రెండు రోజుల్లో అందుతాయని వారికి హామీ ఇచ్చారు అయితే ఈనెల 10వ తేదీలోపు కార్మికులకు వేతనాలు అందకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని కార్మిక సంఘ నాయకులు హెచ్చరించారు

Conclusion:బైట్ :నరసింహారెడ్డి సిఐటియు జిల్లా అధ్యక్షులు
బైట్ :జయరామ్ మున్సిపల్ కార్మికుడు
బైట్ :వేమనా రెడ్డి మున్సిపల్ కమిషనర్ అమీన్పూర్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.