


ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్‌గా 'గోల్డెన్ అవర్' గ్రామీ అవార్డుకు ఎంపికైంది. గ్యాంబినో ఆలపించిన 'దిస్ ఈజ్ అమెరికా' నాలుగు విభాగాల్లో గ్రామీని సొంతం చేసుకుంది. ఓ ర్యాప్ గేయానికి ఇంతటి ప్రతిష్టాత్మక పురస్కారం రావడం ఇదే తొలిసారి. మూడు కేటగిరీల్లో పురస్కారాలు అందుకున్నారు ప్రముఖ గాయని లేడీ గాగా. బెస్ట్ న్యూ ఆర్టిస్ట్‌గా 'డువా లిపా' గ్రామీని సొంతం చేసుకుంది.


85 ఏళ్లలో 28 గ్రామీలు


ఇప్పటివరకు 28 గ్రామీ అవార్డులను గెలుచుకున్న వ్యక్తిగా చరిత్ర సృష్టించారు సంగీత దిగ్గజం క్విన్సీ జోన్స్. 85 ఏళ్ల జోన్స్ ఏడు దశాబ్దాలుగా 10 విభాగాల్లో గ్రామీని సొంతం చేసుకున్నారు. తాను రూపొందించిన 'క్విన్సీ' డాక్యుమెంటరీకి 'బెస్ట్ మ్యూజిక్ ఫిల్మ్' కేటగిరిలో పురస్కారం వచ్చింది. ఈ అవార్డుతో బతికున్న వాళ్లలో గ్రామీని అత్యధిక సార్లు ముద్దాడిన వ్యక్తిగా రికార్డుకెక్కాడు. జార్జ్ సోల్టీ 31 పురస్కారాలతో ఈయన కంటే ముందున్నాడు. జార్జ్ 1997లో మరణించారు.
ప్రముఖ కేటగిరీల్లో గ్రామీ అవార్డులందుకున్నది వీళ్లే..


బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ - గోల్డెన్ అవర్ - కేసీ మస్గ్రోవ్స్
రికార్డ్ ఆఫ్ ది ఇయర్ - దిస్ ఈజ్ అమెరికా - చైల్డిష్ గ్యాంబినో
సాంగ్ ఆఫ్ ది ఇయర్ - దిజ్ ఈజ్ అమెరికా - డోనాల్డ్ గ్లోవర్, లుడ్విగ్ గోరాన్సన్(రచయితలు)
న్యూ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ - డువా లిపా
బెస్ట్ మ్యూజిక్ ఫిల్మ్ కేటగిరి - క్విన్సీ - క్విన్సీ జోన్స్