ETV Bharat / briefs

'9ఏళ్లలో భారత్​ సగటు జనాభా వృద్ధి 1.2%'

గడచిన తొమ్మిదేళ్లలో (2010 నుంచి 19 వరకు) భారత దేశ జనాభా ఏటా సగటున 1.2 శాతం వృద్ధి చెందిందని యునైటెడ్​ నేషన్స్​ పాపులేషన్​ ఫండ్​ వెల్లడించింది. ఈ గణాంకాల ప్రకారం భారత దేశ జనాభా 2019 నాటికి 136 కోట్లు దాటింది. పొరుగు దేశం చైనా జనాభా 142 కోట్లుగా ఉంది.

author img

By

Published : Apr 11, 2019, 8:05 PM IST

భారత్​ సగటు జనాభా వృద్ధి 1.2%'

భారత్​లో 2010 నుంచి 2019 మధ్య జనాభా వృద్ధి ఏటా సగటున 1.2 శాతంగా నమోదైనట్లు ఐక్యరాజ్య సమితి జనాభా కార్యకలాపాల నిధి (యూఎన్​పీఏ) నివేదిక వెల్లడించింది.
భారత్​ జనాభా 2019లో 136 కోట్లకు చేరినట్లు పేర్కొంది. భారత దేశ జనాభా 1969లో 54.5 కోట్లు, 1994లో 94.2 కోట్లుగా ఉంది.

చైనా కన్నా రెండింతల వృద్ధి

చైనా వార్షిక జనాభా వృద్ధితో పోల్చుకుంటే... భారత వృద్ధి రెండింతలు ఎక్కువగా ఉన్నట్లు "ఐరాస పునరుత్పత్తి ఆరోగ్య సంస్థ ప్రపంచ జనాభా 2019" గణాంకాల్లో వెల్లడైంది.

2010 నుంచి 2019 మధ్య కాలంలో చైనా జనాభా వృద్ధి రేటు 0.5 శాతంగా నమోదైనట్లు నివేదిక తెలిపింది. ప్రస్తుతం చైనా జనాభా 142 కోట్లకు చేరింది.
చైనా జనాభా 1969లో 80.6 కోట్లుగా, 1994లో 123 కోట్లుగా ఉంది.

తగ్గిన సంతానోత్పత్తి సామర్థ్యం

ఈ నివేదిక ప్రకారం భారతీయ మహిళల సంతానోత్పత్తి రేటు 1969లో 5.6గా ఉండగా... అది 1994లో 3.7కు, 2019లో 2.3కు పడిపోయినట్లు వెల్లడించింది.

పెరిగిన ఆయుర్ధాయం

భారత్​లో గరిష్ఠ జీవనకాల ప్రమాణం 2019లో 69 ఏళ్లకు వృద్ధి చెందినట్లు నివేదిక పేర్కొంది. ఇది1969లో 47 ఏళ్లుగా, 1994లో 60 ఏళ్లుగా ఉంది.

ఏ వయస్సు వారు ఎంత మంది

దేశ జనాభాలో మొత్తం 0 నుంచి 14 ఏళ్లు, 10 నుంచి 24 ఏళ్ల వయసున్న వారు కలిపి 27 శాతం మంది ఉన్నారు. 15 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న వారు 67 శాతం మంది ఉన్నారు. 65 ఏళ్లు పైబడిన వారు 6 శాతం మంది ఉన్నారు.

జనన, మరణాలు

ప్రసూతి మరణాల నిష్పత్తిలో తగ్గుదల... భారత్​లో మెరుగైన ఆరోగ్య సంరక్షణ వృద్ధిని తెలియ జేస్తున్నట్లు నివేదిక తెలిపింది.

ఈ నివేదిక ప్రకారం 1994లో ప్రతి లక్ష జననాలకు 488 మరణాలు ఉంటే... 2015లో నాటికి అవి 174కు తగ్గాయి.

ఆందోళన కరంగా మహిళల ఆరోగ్య వృద్ధి

ప్రపంచ వ్యాప్తంగా మహిళల ఆరోగ్య గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయని యూఎన్​పీఏ జెనీవ డైరెక్టర్​ మోనికా ఫెర్రో అన్నారు. 15 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న మహిళల వివరాలు మొదటి సారి ప్రచురించినట్లు ఈ నివేదికలో పేర్కొన్నట్లు ఆమె చెప్పారు.

వీటిని సాధారణ స్థితికి తీసుకురావాలంటే... ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మహిళలకు మెరుగైన ఆరోగ్య సేవలందిచాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
జీవిత భాగస్వామితో లైంగిక కలయిక, గర్భనిరోధం, ఆరోగ్య సంరక్షణ వంటి విషయాలపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

ఓ విశ్లేషణ ప్రకారం మహిళలకు పునరుత్పత్తి, లైంగిక పరమైన హక్కులు లేకపోవడం కారణంగా... వారు విద్య, ఆదాయ, రక్షణ వంటి విషయాల్లో వెనుకబడి... వారి సొంత భవిష్యత్తును నిర్ణయించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. ఇందుకు ప్రధాన కారణం బాల్య వివాహాలేనని నివేదికలో వెల్లడైంది.

తక్షణమే అవసరం

ప్రపంచ వ్యాప్తంగా 3కోట్ల50లక్షల మంది మహిళలు, అమ్మాయిలకు ప్రస్తుతం అత్యవసర ఆరోగ్యపరమైన సేవలందించాల్సి ఉందని నివేదిక హెచ్చరించింది.
ప్రతి రోజు 500లకు పైగా స్త్రీలు ప్రసవ సంబంధ కారణాలతో మరణిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
POOL
London, 27 November 2017
1. Medium shot Prince Harry and Meghan Markle posing for photos and leaving
POOL
London, 12 February 2019
++NIGHT SHOTS++
4. The Duke and Duchess Sussex arrive at the Natural History Museum to attend the gala performance of "The Wider Earth"
UK POOL
Birkenhead, 14 January 2019
5. Tilt down Duchess of Sussex examining child's knitted hat
6. Medium shot audience
7. Wide shot with zoom in, Duchess of Sussex walking to microphone
UK POOL
London, 9 January 2019
8. Various shots Duchess of Sussex visiting a charity that helps unemployed and vulnerable women dress for job interviews
UK POOL
London, 7 February 2019
9. Close-up Duke and Duchess of Sussex talking to guests
10. Tilt up from Duchess' baby bump
POOL
London, 16 January 2019
11. Wide of Duchess of Sussex arriving at Mayhew animal welfare center
12. UPSOUND (English) Peggy, pensioner:
"And you're a fat lady."
UPSOUND (English) Duchess of Sussex:
"(Laughs). I'll take it."
POOL
London, 30 January 2019
13. Wide shot Duchess of Sussex speaking to metalworkers
14. Various shots Duchess of Sussex speaking to metalworkers
15. Close-up baby bump
STORYLINE:
PRINCE HARRY, MEGHAN TO KEEP BABY ARRIVAL PLANS PRIVATE
Prince Harry and his heavily pregnant wife Meghan, the Duchess of Sussex, say they have decided to keep plans around their baby's arrival private.
Kensington Palace officials said in a statement Thursday (11 APRIL 2019) that Harry and Meghan "look forward" to sharing the news of their baby's birth once they have had a chance to celebrate privately as a new family.
The royal couple are expecting their first child in late April or early May.  Few details have been announced.
They say they are grateful for the goodwill messages they have received from around the world.
The couple, who wed in May at Windsor Castle, recently moved from central London to a more secluded house near their wedding venue.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.