వార్షిక ప్రపంచ ప్రతిభా సూచీని విడుదల చేసింది ప్రముఖ ఐఎండీ సంస్థ. ఇందులో భారత్ గత ఏడాదితో పోలిస్తే 6 స్థానాలు దిగజారి 59వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో మొత్తం 63 దేశాలను పరిగణనలోకి తీసుకుంది ఐఎండీ. మొదటి స్థానాన్ని స్విట్జర్లాండ్ కైవసం చేసుకుంది. కనిష్ఠ జీవన ప్రమాణాలు, విద్యావ్యయం కారణంగానే భారత్ ర్యాంకు మరింత దిగజారినట్లు ఐఎండీ తెలిపింది.
ప్రపంచ ప్రతిభా జాబితాను సిద్ధం చేసేందుకు.. పెట్టుబడులు, అభివృద్ధి, పోటీతత్వం, నివేదన వంటి అంశాలను పరిగణనలోకి తీసకుంది ఐఎండీ. ఈ జాబితాలో బ్రిక్స్ సభ్య దేశాల కంటే భారత్ వెనుకంజలో ఉండటం గమనార్హం.
ప్రపంచ ప్రతిభా సూచీలో స్వి ట్జర్లాండ్ (1), డెన్మార్క్ (2), స్వీడన్ (3), ఆస్ట్రియా (4 ), లక్సెంబర్గ్ (5 ), నార్వే (6 ), ఐస్లాండ్(7 ), ఫిన్ లాండ్ (8 ), నెదర్లాండ్ (9 ), సింగపూర్ (10 ) మొదటి పది స్థానాల్లో నిలిచాయి. ఈ దేశాలు అధిక పెట్టుబడులు, మెరుగైన విద్య, జీవన ప్రమాణాలను ప్రదర్శిస్తున్నాయని వెల్లడించింది ఐఎండీ. బ్రిక్స్ దేశాలైన చైనా (42), రష్యా (47), దక్షిణాఫ్రికా 50వ స్థానంలో ఉన్నాయి.
ఇదీ చూడండి:సియాచిన్ మంచు తుపానులో ఆరుగురు మృతి!