రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశం కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలను www.tswreis.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలోని సాంఘిక, గిరిజన, బీసీ, జనరల్ గురుకులాల్లో సీట్ల భర్తీ కోసం అర్హత పరీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ, విద్యా శాఖ పరిధిలోని 616 గురుకుల పాఠశాలల్లో 47,750 సీట్ల కోసం 1,35,608 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఒక్కో విద్యాలయంలో 80 మందికి అవకాశం కల్పించనున్నారు.
ఇవీ చూడండి: ముగిసిన రాళ్లపల్లి అంత్యక్రియలు