హైదరాబాద్లోని శృంగేరి పీఠం నల్లకుంట శంకర మఠంలో సుమారు 20 లక్షల విలువ చేసే 25 తులాల బంగారం చోరికి గురైంది. నగలు మాయమైనట్లు గుర్తించిన ఆలయ మేనేజర్ కృష్ణారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. క్లర్కు స్థాయి ఉద్యోగి ఈ పని చేశాడని.. విచారణలో నిజం అంగీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. ఉద్యోగిని ప్రశ్నించి నిజనిజాలు వెల్లడిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: ఎమ్మెల్యే కారు ఢీకొని చిన్నారి మృతి