ETV Bharat / briefs

ఎన్డీయేకు వ్యతిరేకంగా.. దిల్లీలో చంద్రబాబు మంతనాలు! - meeting

ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీలో పావులు కదుపుతున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
author img

By

Published : May 8, 2019, 11:44 PM IST

జాతీయ ప్రజాస్వామ్య కూటమికి వ్యతిరేకంగా రాజకీయ పక్షాలను ఏకం చేస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు.. దిల్లీలో మరింత వేగంగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో 20 నిమిషాలపాటు సమాలోచనలు చేశారు. ఇప్పటికే.. పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమత బెనర్జీ, మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్​తో మంతనాలు జరిపారు. డీఎంకే అధినేత స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సహా పలువురు నేతలతో పలు సందర్భాల్లో చర్చించారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రతికూల పరిస్థితి ఉన్నట్లు అంచనా వేస్తున్న చంద్రబాబు... ప్రతిపక్షాలను కలుపుకుని వెళ్లేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఈ నెల 19 తర్వాత దిల్లీలో అన్ని పార్టీల నేతలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు యోచిస్తున్న ఏపీ సీఎం... ఈ నెల 21న విపక్ష నేతలతో దిల్లీలో భేటీ నిర్వహించే అవకాశం ఉన్నట్టు దిల్లీ వర్గాలంటున్నాయి.

ఇవీ చూడండి: 'స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు రద్దు చేయాలి'

Intro:Ap_vsp_47_anganwadi_vidyardhula_convocationday_ab_c4
విశాఖ జిల్లా అనకాపల్లి అంగన్వాడి కేంద్రాల్లో విద్యనభ్యసిస్తున్న చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు అనకాపల్లి పట్టణ పరిధిలో 74 అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు నిండి ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదివేందుకు వెళ్తున్న 43మంది విద్యార్థులకు యూకేజీ పూర్తి చేసిన పట్టా అందజేసి గ్రాడ్యుయేషన్ డే ని ఘనంగా జరిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని తమ పిల్లలకు అందజేస్తున్న పట్టాను పరిశీలించి మురిసిపోయారు.

Body:అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు ఆట పాటలతో కూడిన విద్యను అందించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది దీంట్లో భాగంగా ఆంగ్ల మాధ్యమ బోధన చేస్తున్నారు. దీనికోసం అంగన్వాడీ కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ అందజేసారు. నర్సరీ ఎల్కేజీ యూకేజీ విద్యాబోధన అంగన్వాడీ కేంద్రాల్లో చేపడుతూ ఐదేళ్లు నిండిన చిన్నారులను ప్రభుత్వ పాఠశాలో చేర్పిస్తున్నారు. అంగన్వాడి లో మెరుగైన విద్యాబోధన అందించడంతో దింట్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య అనకాపల్లి లో పెరుగుతుంది

Conclusion:బైట్1 మేరీ సువార్త ఐసిడిఎస్అర్బన్ ప్రాజెక్ట్ అధికారిని అనకాపల్లి
బైట్2 గ్రేసీ విశాఖ జిల్లా కన్సల్టెంట్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.