ETV Bharat / briefs

గాలిశుద్ది యంత్రం తయారు చేసిన బీవీఆర్​ఐటీ అధ్యాపకుడు - బీవీఆర్​ఐటీ అధ్యాపకుడి ఆవిష్కరణ

మెదక్​ జిల్లా నర్సాపూర్​ సమీపంలోని బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్​ కళాశాల అధ్యాపకుడు గాలి శుద్ధి యంత్రాన్ని ఆవిష్కరించారు. కరోనా సోకిన వ్యక్తుల దగ్గర ఉంచితే ఇతరులకు వ్యాప్తి చెందకుండా నివారిస్తుందని ఆయన తెలిపారు.

గాలిశుద్ది యంత్రం తయారు చేసిన బీవీఆర్​ఐటీ అధ్యాపకుడు

author img

By

Published : Aug 20, 2020, 11:10 PM IST

కరోనా వైరస్‌ గాలి శుద్ధి పరికరాన్ని… మెదక్‌ జిల్లా నర్సాపూర్​ సమీపంలోని బీవీఆర్​ఐటీ ఇంజనీరింగ్​ కళాశాల రసాయనశాస్త్ర విభాగ అధ్యాపకులు డాక్టర్‌ శ్రీనివాస్‌ తయారు చేశారు. రూ. 6500తో తయారు చేసిన ఈ యంత్రంలో… నాలుగు ఛాంబర్‌లు ఏర్పాటు చేశారు. మొదటగా యూవీ లైట్, రెండో దశ సోడియం హైపోక్లోరైడ్​తో ‌ఫిల్టర్‌ అవుతుంది. ఈ రెండు దశల్లోనే కరోనా నిర్మూలించడం జరుగుందన్నారు.

మూడో దశ బేరియం హైడ్రాక్సైడ్​‌, నాలుగో దశలో అలమ్‌(పటిక) ఫిల్టర్‌ అవుతుందని తెలిపారు. గాలిలో ఉన్న దుమ్ము, ధూళీ కణాలను శుద్ది చేస్తుందని వివరించారు. కరోన సోకినవారి వద్ద ఇది ఏర్పాటు చేస్తే ఇతరులకు సోకకుండా ఉంటుందని చెప్పారు. చిన్న గది అయితే పది నిమిషాల్లో శుద్ధి చేస్తుందని పేర్కొన్నారు. దీనిని రిమోటు సాయంతో ఉపయోగించొచ్చన్నారు.

కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ లక్ష్మీప్రసాద్‌, కెమికల్‌ ఇంజినీరింగ్​ విభాగ అధిపతి డాక్టర్‌ రాధిక… యంత్రం తీరును పరిశీలించి అభినందించారు. మరిన్ని యంత్ర పరికరాలు తయారు చేయడానికి ప్రణళికలు చేస్తున్నట్లు అధ్యాపకుడు శ్రీనివాస్‌ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.